Share News

ఒక్క ఫోన్‌ చేయండి.. వచ్చేస్తా!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:42 AM

ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు తిరిగి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టున్నాడు. ఎందుకంటే.. భారత్‌తో జరిగే టెస్టు సిరీ్‌సకు...

ఒక్క ఫోన్‌ చేయండి.. వచ్చేస్తా!

  • భారత్‌తో సిరీస్‌ కోసం వార్నర్‌

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు తిరిగి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టున్నాడు. ఎందుకంటే.. భారత్‌తో జరిగే టెస్టు సిరీ్‌సకు తన సేవలు అవసరమనుకుంటే.. కచ్చితంగా అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. ‘జట్టు కోసం నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు. ఆసీస్‌ ఆటగాళ్లు ఫిబ్రవరిలో టెస్టు తర్వాత షెఫీల్డ్‌ షీల్డ్‌లో ఓ మ్యాచ్‌ మాత్రమే ఆడారు. ఒకవేళ భారత్‌తో సిరీ్‌సకు నేను కావాలనుకుంటే తదుపరి షీల్డ్‌ గేమ్‌ ఆడి సిద్ధంగా ఉంటాను’ అని వార్నర్‌ తెలిపాడు.

Updated Date - Oct 23 , 2024 | 12:42 AM