మంధాన, రిచా ధనాధన్!
ABN , Publish Date - Dec 20 , 2024 | 06:08 AM
సిరీ్‌సలో వరుసగా మూడో హాఫ్ సెంచరీతో తాత్కాలిక కెప్టెన్ స్మృతీ మంధాన (47 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 77) మెరవగా..యువ బ్యా టర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) పొట్టి ఫార్మాట్‌లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది...
మనదే సిరీస్
మూడో టీ20లో వెస్టిండీస్ చిత్తు
ముంబై: సిరీ్‌సలో వరుసగా మూడో హాఫ్ సెంచరీతో తాత్కాలిక కెప్టెన్ స్మృతీ మంధాన (47 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 77) మెరవగా..యువ బ్యా టర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) పొట్టి ఫార్మాట్‌లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. దాంతో వెస్టిండీ్‌సపై ఆఖరి టీ20లో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 60 పరుగులతో ఘన విజయం అందుకున్న భారత్ సిరీ్‌సను 2-1తో దక్కించుకుంది. గత ఐదేళ్ల కాలంలో భారత గడ్డపై టీమిండియాకిదే తొలి టీ20 సిరీస్ విజయం. తొలుత మన అమ్మాయిలు 20 ఓవర్లలో 217/4 స్కోరు సాధించారు. మంధాన, రిచాకు తోడు జెమీమా (39), రాఘవీ బిస్త్ (31 నాటౌట్) రాణించారు. భారీ ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 157/9 స్కోరుకే పరిమితమైంది. హెన్రీ (43) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా రిచా, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీ్‌స’గా మంధాన నిలిచారు.
రిచా వరల్డ్ రికార్డ్: కీపర్ రిచా ఘోష్ మహిళల టీ20లలో వరల్డ్ రికార్డును సమం చేసింది. 18 బంతుల్లో 50 పరుగులు చేసిన 21 ఏళ్ల రిచా.. అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్), లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా)తో కలిసి అగ్ర స్థానంలో నిలిచింది.
సంక్షిప్తస్కోర్లు: భారత్ 20 ఓవర్లలో 217/4 (మంధాన 77, రిచా ఘోష్ 54, జెమీమా 39); వెస్టిండీస్ 20 ఓవర్లలో 157/9 (హెన్రీ 43, రాధా యాదవ్ 4/29).
1
ఈ ఏడాది టీ20లలో అత్యధిక పరుగులు (23 మ్యాచ్‌లు, 763 రన్స్) చేసిన బ్యాటర్‌గా మంధాన.
1
217/4 టీ20లలో భారత్ అత్యధిక స్కోరు