Share News

ముష్ఫికర్‌ భారీ శతకం

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:53 AM

మిడిలార్డర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (191) భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసింది...

ముష్ఫికర్‌ భారీ శతకం

  • బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ 565

  • పాక్‌తో మొదటి టెస్టు

రావల్పిండి: మిడిలార్డర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (191) భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 565 పరుగులు చేసింది. మెహెదీ హసన్‌ (77), లిట్టన్‌ దాస్‌ (56) అర్ధశతకాలు సాధించారు. నసీమ్‌ షాకు 3.. షహీన్‌, అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ నాలుగోరోజైన శనివారం ఆట ముగిసేసరికి 23/1 స్కోరుతో నిలిచింది. క్రీజులో అబ్దుల్లా (11), షాన్‌ మసూద్‌ (9) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌ను 448/6 స్కోరుతో డిక్లేర్‌ చేసిన పాక్‌.. ప్రస్తుతం మరో 94 పరుగులు వెనుకంజలో ఉంది. ఆటకు ఆదివారం ఆఖరి రోజు కావడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Aug 25 , 2024 | 05:53 AM