Share News

MS Dhoni: ధోనీ కొత్త లుక్ చూశారా? అదరగొడుతున్న మిస్టర్ కూల్ కొత్త హెయిర్ స్టైల్..

ABN , Publish Date - Oct 12 , 2024 | 08:18 PM

ఎమ్‌ఎస్ ధోనీ వచ్చే ఐపీఎల్‌లో ఆడతాడా? ఆడడా? అనే చర్చ అతడి అభిమానుల్లో జోరుగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ధోనీ తన సరికొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులకు షాకిచ్చాడు. తన కెరీర్ ఆరంభం నుంచే ధోనీ తన హెయిర్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు.

MS Dhoni: ధోనీ కొత్త లుక్ చూశారా? అదరగొడుతున్న మిస్టర్ కూల్ కొత్త హెయిర్ స్టైల్..
Dhoni`s New Hairstyle

ఎమ్‌ఎస్ ధోనీ (MS Dhoni) వచ్చే ఐపీఎల్‌లో (IPL 2025) ఆడతాడా? ఆడడా? అనే చర్చ అతడి అభిమానుల్లో జోరుగా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ధోనీ తన సరికొత్త హెయిర్‌స్టైల్‌తో (Dhoni`s New Hairstyle) అభిమానులకు షాకిచ్చాడు. తన కెరీర్ ఆరంభం నుంచే ధోనీ తన హెయిర్‌తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో తన జులపాల జుట్టుతో పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్‌ను కూడా ధోనీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టి జుట్టుకు మారిపోయాడు. గత ఐపీఎల్‌లో మళ్లీ లాంగ్ హెయిర్‌కు మారాడు. తాజాగా మరో కొత్త హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.


సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అలీమ్ హకీమ్‌ సహాయంతో కొత్త హెయిర్‌స్టైల్‌కు మారాడు. ఆ హెయిర్‌స్టైల్‌ కారణంగా 43 ఏళ్ల ధోనీ పాతికేళ్ల కుర్రాడిలా మారిపోయాడు. అలీమ్ హకీమ్‌ (Aalim Hakim) తన సోషల్ మీడియా ఖాతాలో ఆ ఫొటోలను పంచుకున్నాడు. ``వన్ అండ్ ఓన్లీ తలా`` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త హెయిర్‌స్టైల్‌తో ఉన్న ధోనీని చూసి అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొత్త హెయిర్‌స్టైల్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రాబోయే ఐపీఎల్ కోసమే ఈ కొత్త హెయిర్‌స్టైల్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ గతేడాది ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీని అప్పగించాడు. అయితే ఈ సీజన్‌లో ధోనీ ఆడతాడా? ఆడడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఐపీఎల్ కొత్త నిబంధనల ప్రకారం ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని భారతీయ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్ హోదాలో కొనసాగించే అవకాశం ఉంది. ధోనీని ఐపీఎల్ ఆడించడం కోసమే ఈ నిబంధన అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మరి, వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతాడా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2024 | 08:19 PM