Share News

దిగ్గజంతో జతకట్టిన నీరజ్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:30 AM

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కొత్త కోచ్‌తో జత కట్టాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌, ప్రపంచ రికార్డు గ్రహీత అయిన 58 ఏళ్ల యాన్‌ జెలెస్నీ నీరజ్‌ కోచ్‌గా...

దిగ్గజంతో జతకట్టిన నీరజ్‌

కొత్త కోచ్‌గా యాన్‌ జెలెస్నీ

న్యూఢిల్లీ: స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కొత్త కోచ్‌తో జత కట్టాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌, ప్రపంచ రికార్డు గ్రహీత అయిన 58 ఏళ్ల యాన్‌ జెలెస్నీ నీరజ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఇన్నాళ్లూ నీరజ్‌తో పనిచేసిన క్లాస్‌ బర్తోనీజ్‌ (జర్మనీ) కుటుంబ కారణాల రీత్యా కోచ్‌ పదవి నుంచి ఇటీవలే వైదొలగిన సంగతి తెలిసిందే. క్లాస్‌ హయాంలోనే నీరజ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, ప్రపంచ చాంపియన్‌షి్‌పతో పాటు అనేక టైటిళ్లు నెగ్గాడు. 1992, 1996, 2000 ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన జెలెస్నీ.. 1993, 1995, 2001లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఈటెను 98.48 మీటర్ల దూరం విసిరి అప్పట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Updated Date - Nov 10 , 2024 | 01:30 AM