Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా హౌస్.. స్పెషల్ వీడియో పంచుకున్న నీతా అంబానీ!
ABN , Publish Date - Jul 30 , 2024 | 03:08 PM
పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి దాదాపు 117 మంది క్రీడాకారులు పారిస్‌కు తరలివెళ్లారు. వీరందరి కోసం, ఒలింపిక్ అతిథులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడం కోసం ఒలింపిక్ గ్రామంలో ``ఇండియా హౌస్``ను ఏర్పాటు చేశారు.
పారిస్ (Paris)లో జరుగుతున్న ఒలింపిక్ పోటీలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి దాదాపు 117 మంది క్రీడాకారులు పారిస్‌కు తరలివెళ్లారు. వీరందరి కోసం, ఒలింపిక్ అతిథులకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయడం కోసం ఒలింపిక్ గ్రామంలో ``ఇండియా హౌస్`` (India House)ను ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) ఆ ``ఇండియా హౌస్``ను ప్రారంభించారు. తాజాగా ఆ ``ఇండియా హౌస్``కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు (Paris Olympics 2024).
ఆ ఇండియా హౌస్‌కు సంబంధించిన విశేషాలను, వివరాలను నీతా పంచుకున్నారు. ``ఒలింపిక్ క్రీడల్లో పోటీపడుతున్న క్రీడాకారుల కోసం తొలిసారిగా ఒలింపిక్ గ్రామంలో ఓ సొంత ఇల్లు ఏర్పాటు చేశాం. కశ్మీర్, బనారస్ నుంచి తీసుకొచ్చిన కళాకృతులను, భారతీయ సాంప్రదాయ ఆభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నాం`` అంటూ ఆ ఇండియా గురించి నీతా వివరించారు. ఆ ఇండియా హౌస్ ప్రారంభ వేడుకలను వీడియోలో చూపించారు. కళాకారులతో పాటు నీతా అంబానీ కూడా నృత్యం చేశారు. ఈ వీడియోలో ఈశా కూడా కనిపించారు.
పారిస్‌లోని లా విల్లెట్ ప్రాంతంలో ఈ ``ఇండియా హౌస్``ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభ వేడుకలు చాలా అట్టహాసంగా జరిగాయి. నీతా అంబానీతో పాటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రాతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: సూర్యకుమార్ తాత్కాలిక కెప్టెనే.. అసలు నాయకుడు అతడే!
Rohan Bopanna : ఆఖరి మ్యాచ్ ఆడేశా
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..