Share News

‘పుష్ప’ స్టయిల్లో..

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:40 AM

కెరీర్‌లో తొలి టెస్టు అర్ధ శతకం సాధించిన నితీశ్‌ ‘పుష్ప’ మాదిరిగా సంబరం చేసుకున్నాడు. 50 పరుగులు పూర్తి చేయగానే బ్యాటుతో అభిమానులకు అభివాదం చేశాడు. ‘పుష్ప’ సినిమాలో హీరో మాదిరి...

‘పుష్ప’  స్టయిల్లో..

కెరీర్‌లో తొలి టెస్టు అర్ధ శతకం సాధించిన నితీశ్‌ ‘పుష్ప’ మాదిరిగా సంబరం చేసుకున్నాడు. 50 పరుగులు పూర్తి చేయగానే బ్యాటుతో అభిమానులకు అభివాదం చేశాడు. ‘పుష్ప’ సినిమాలో హీరో మాదిరి బ్యాటును మెడకింద కుడివైపు నుంచి ఎడమవైపునకు తీసుకొచ్చాడు. అదే వీడియోను ‘పుష్పకాదు..ఫైర్‌’ అంటూ బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇక శతకం సాధించిన సందర్భాన్ని నితీశ్‌ మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. బ్యాట్‌ను గ్రౌండ్‌పై నిలువుగా పెట్టి మోకాళ్లపై నిలుచున్నాడు. బ్యాట్‌ హ్యాండిల్‌పై హెల్మెట్‌ను ఉంచి ఆకాశంలో చూస్తూ సలార్‌ సినిమాలో హీరోని గుర్తు చేశాడు.

Updated Date - Dec 29 , 2024 | 05:41 AM