Share News

ఇక.. ‘సూపర్‌’ మజా

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:54 AM

టీ20 ప్రపంచకప్‌లో ఇక కీలక సమరానికి వేళైంది. మొత్తం 20 జట్లు పోటీపడ్డ ఈ మెగా టోర్నమెంట్‌లో పేలవ ప్రదర్శన చేసిన 12 జట్లు గ్రూప్‌ దశలోనే వెనుదిరిగాయి. అత్యుత్తమంగా రాణించిన జట్లు సూపర్‌-8 పోరుకు అర్హత సాధించాయి...

ఇక.. ‘సూపర్‌’ మజా

బార్బడోస్‌లోని బీచ్‌లో వాలీబాల్‌ ఆడుతున్న

టీమిండియా క్రికెటర్లు విరాట్‌, రింకూ సింగ్‌

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

టీ20 ప్రపంచకప్‌లో ఇక కీలక సమరానికి వేళైంది. మొత్తం 20 జట్లు పోటీపడ్డ ఈ మెగా టోర్నమెంట్‌లో పేలవ ప్రదర్శన చేసిన 12 జట్లు గ్రూప్‌ దశలోనే వెనుదిరిగాయి. అత్యుత్తమంగా రాణించిన జట్లు సూపర్‌-8 పోరుకు అర్హత సాధించాయి. బుధవారం నుంచి జరిగే ఈ సూపర్‌ ఫైట్‌లో పోటీపడే ఆ జట్లు ఏంటన్నది ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఇకపోతే..సూపర్‌-8 దశ గ్రూపులను ప్రిలిమినరీ పోటీల సందర్భంగా ఆయా జట్లకు కేటాయించిన సీడింగ్‌ల ఆధారంగా నిర్ణయించారు. దీని ప్రకారం ఎ1గా భారత్‌, ఎ2గా పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ బి1, ఆస్ట్రేలియా బి2, న్యూజిలాండ్‌ సి1, వెస్టిండీస్‌ సి2, దక్షిణాఫ్రికా డి1, శ్రీలంక డి2గా టోర్నీకి ముందు లీగ్‌ దశలో పోటీపడ్డాయి. లీగ్‌ దశలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, అమెరికా.. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా.. గ్రూప్‌-సి నుంచి అఫ్ఘానిస్థాన్‌, వెస్టిండీస్‌.. గ్రూప్‌-డి నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సూపర్‌-8లో ప్రవేశించాయి. భారత్‌, అఫ్ఘానిస్థాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్లను గ్రూప్‌-1గా... అమెరికా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లను గ్రూప్‌-2గా విభజించారు. ఇందులో ఒక్కో జట్టు ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. అంటే.. ప్రతి జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడతాయి.


దీంతో ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌ చేరతాయి. సూపర్‌-8లో భాగంగా టీమిండియా తన పోరును అఫ్ఘానిస్థాన్‌తో ఈనెల 20న ప్రారంభించనుంది. తర్వాతి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో 22న, చివరి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో 24న ఆడనుంది. కాగా, సూపర్‌-8 మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌ వేదికగానే జరగనున్నాయి.

సూపర్‌-8 షెడ్యూల్‌

తేదీ మ్యాచ్‌ సమయం

జూన్‌ 19 దక్షిణాఫ్రికా X అమెరికా రా. 8 గం.

జూన్‌ 20 ఇంగ్లండ్‌ X వెస్టిండీస్‌ ఉ. 6 గం.

జూన్‌ 20 భారత్‌ X అఫ్ఘానిస్థాన్‌ రా. 8 గం.

జూన్‌ 21 ఆస్ట్రేలియా X బంగ్లాదేశ్‌ ఉ. 6 గం.

జూన్‌ 21 ఇంగ్లండ్‌ X దక్షిణాఫ్రికా రా. 8 గం.

జూన్‌ 22 వెస్టిండీస్‌ X అమెరికా ఉ. 6 గం.

జూన్‌ 22 భారత్‌ X బంగ్లాదేశ్‌ రా. 8 గం.

జూన్‌ 23 అఫ్ఘానిస్థాన్‌ X ఆస్ట్రేలియా ఉ. 6 గం.

జూన్‌ 23 ఇంగ్లండ్‌ X అమెరికా రా. 8 గం.

జూన్‌ 24 వెస్టిండీస్‌ X దక్షిణాఫ్రికా ఉ. 6 గం.

జూన్‌ 24 భారత్‌ ్ఠ ఆస్ట్రేలియా రా. 8 గం.

జూన్‌ 25 అఫ్ఘానిస్థాన్‌ ్ఠ బంగ్లాదేశ్‌ ఉ. 6 గం.

గ్రూప్‌-1

భారత్‌,

ఆస్ట్రేలియా,

అప్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌

గ్రూప్‌-2

అమెరికా, ఇంగ్లండ్‌,

వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా

Updated Date - Jun 18 , 2024 | 04:54 AM