ODI Series : హెడ్ సూపర్ సెంచరీ
ABN , Publish Date - Sep 21 , 2024 | 03:46 AM
ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో గెలిచింది.
లబుషేన్ ఆల్‌రౌండ్ షో
ఇంగ్లండ్‌పై ఆసీస్ గెలుపు
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లతో గెలిచింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బెన్ డకెట్ (95), విల్ జాక్స్ (62) అర్ధ సెంచరీలతో రాణించడంతో 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (154 నాటౌట్) శతకానికి తోడు లబుషేన్ (77 నాటౌట్) సత్తా చాటడంతో ఆసీస్ 44 ఓవర్లలో 317/3 స్కోరు చేసి గెలిచింది. హెడ్‌కిది కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ఇక మార్కస్ లబుషేన్ ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీకి పైగా రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. ఇంకా 4 క్యాచ్‌లు కూడా పట్టాడు. ఓ వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘనత సాధించిన తొలి ఆటగాడిగా లబుషేన్ రికార్డులకెక్కాడు.