Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!
ABN , Publish Date - Jul 29 , 2024 | 09:01 AM
ఒలింపిక్ కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ నోటి దూలను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా మహిళ జట్టును అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాబ్ సహచరులు కూడా అతని కామెంట్లను ఖండించారు. ఇంకేముంది టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ యూరోస్పోర్ట్స్ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్షణమే బాబ్‌ను విధుల నుంచి తప్పించింది.
Olympics: ఒలింపిక్ కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ (Olympic Commentator Bob Ballard) నోటి దూలను ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా మహిళ జట్టును అవహేళనగా మాట్లాడారు. ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. బాబ్ సహచరులు కూడా అతని కామెంట్లను ఖండించారు. ఇంకేముంది టెలివిజన్ బ్రాడ్ కాస్టర్ యూరోస్పోర్ట్స్ కంపెనీ చర్యలు తీసుకుంది. తక్షణమే బాబ్‌ను విధుల నుంచి తప్పించింది. జరిగిన ఘటనపై బాబ్ మాత్రం స్పందించలేదు.
ఏం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా మహిళల స్విమ్మింగ్ జట్టు శనివారం నాడు 4x100 మీటర్ల ఫ్రీ స్టైల్ రీలే విభాగంలో బంగారు పతకం సాధించింది. వారిపై బాబ్ బల్లార్డ్ అసభ్యంగా మాట్లాడారు. ‘మహిళలు ఇప్పుడే పూర్తి చేశారు. అతివలు ఎలా ఉంటారో మీకు తెలుసు.. చుట్టూ తిరుగుతారు. మేకప్ చేస్తుంటారు అని’ డబుల్ మీనింగ్‌లో మాట్లాడారు. ఓ మహిళ జట్టు గోల్డ్ కప్ గెలిచిన సందర్భంలో తక్కువ చేసి మాట్లాడారు. బల్లార్డ్ మాటాలను కో కామెంటేటర్ లిజ్జీ సిమండ్స్ తప్పు పట్టారు. ఆస్ట్రేలియా మహిళలపై బాబ్ దారుణంగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
వివరణ
జరిగిన ఘటన గురించి యూరోస్పోర్ట్స్ యజమాన్యం వెంటనే స్పందించింది. శనివారం రాత్రి కవరేజ్ జరిగే సమయంలో కామెంటేటర్ బాబ్ బల్లార్డ్ అనుచితంగా మాట్లాడారు. ‘ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసివేశాం. తమ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి అని’ యూరో స్పోర్ట్స్ కంపెనీ స్పష్టం చేసింది. అథ్లెట్లపై వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం ఏ మాత్రం సరికాదని పేర్కొంది.
నో జాబ్..
ఏం చక్కా జాబ్ చేసుకొని, ఇంటిని చక్కదిద్దే బిల్లార్డ్ నోటి దూలతో ఉద్యోగం కోల్పోయాడు. మరో జాబ్ దొరికే వరకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. అతని గురించి తెలిసి, మరో కంపెనీ జాబ్ ఆఫర్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహిళ జట్టును విమర్శించడం జాత్యాంహకారం కిందకి వస్తుందని మరికొందరు చెబుతున్నారు. మహిళ జట్టుపై కామెంట్ చేసి బిల్లార్డ్ తేనె తుట్టేను కదిలించినట్టు అయ్యింది. ఆ వ్యాఖ్యలు, జాబ్ కోల్పోవడం గురించి బాబ్ బిల్లార్డ్ ఇప్పటివరకు నోరు మెదపలేదు.