Share News

Olympic Games : వినువీధిలో ఒలింపిక్‌ జ్యోతి

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:19 AM

బోట్లపై అథ్లెట్ల పరేడ్‌ నిర్వహించి ప్రత్యేకత చాటుకున్న పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులు మరో వినూత్న ఆలోచన చేశారు. ఒలింపిక్‌ జ్యోతిని ఆకాశంలోకి పంపాలని వారు నిర్ణయించారు.

 Olympic  Games : వినువీధిలో ఒలింపిక్‌ జ్యోతి

పారిస్‌: బోట్లపై అథ్లెట్ల పరేడ్‌ నిర్వహించి ప్రత్యేకత చాటుకున్న పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులు మరో వినూత్న ఆలోచన చేశారు. ఒలింపిక్‌ జ్యోతిని ఆకాశంలోకి పంపాలని వారు నిర్ణయించారు. ఈమేరకు ఒలింపిక్‌ జ్యోతిని ఓ గాజు పెట్టెలో ఉంచి దానిని ఓ బెలూన్‌కు అనుసంధానం చేశారు. సూర్యాస్తమయం తర్వాత టుయిలరీ గార్డెన్స్‌ నుంచి 60 మీ. పైగా ఎత్తులో నింగిలోకి ఒలింపిక్‌ జ్యోతి శనివారం రాత్రి చేరుకుంది. తెల్లవారుజామున రెండు గంటల వరకు ఇది వీక్షకులకు కనువిందు చేయనుంది. అనంతరం తిరిగి భూమి మీదకు వస్తుంది. ఉదయమంతా టుయిలరీ గార్డెన్స్‌లో జ్యోతిని ప్రేక్షకులు సందర్శించవచ్చు. ప్రతి రోజూ 10వేల మందికి ఉచితంగా ఒలింపిక్‌ జ్యోతిని దర్శించుకొనే అవకాశం కల్పించారు.

Updated Date - Jul 28 , 2024 | 06:19 AM