Share News

‘అవుటాఫ్‌ దిస్‌ వరల్డ్‌’..

ABN , Publish Date - May 03 , 2024 | 02:53 AM

మరో నెల రోజుల్లో పురుషుల టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌ అధికారిక గీతాన్ని...

‘అవుటాఫ్‌ దిస్‌ వరల్డ్‌’..

టీ 20 ప్రపంచ కప్‌ గీతం విడుదల

న్యూఢిల్లీ: మరో నెల రోజుల్లో పురుషుల టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌ అధికారిక గీతాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం విడుదల జేసింది. గ్రామీ అవార్డు విజేత సీన్‌ పాల్‌, సోకా సూపర్‌ స్టార్‌ కెస్‌ సంయుక్తంగా ‘అవుటాఫ్‌ దిస్‌ వరల్డ్‌’ పేరిట ఈ గీతాన్ని రూపొందించారు. మైఖేల్‌ టానో మొంటానో నిర్మాణంలో గీతం రూపొందింది. జమైకా దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌, వెస్టిండీస్‌ క్రికెట్‌ స్టార్లు క్రిస్‌ గేల్‌, శివనారాయణ్‌ చందర్‌పాల్‌, స్టెఫానీ టేలర్‌, అమెరికా బౌలర్‌ అలీ ఖాన్‌ ఈ అధికారిక గీతానికి సంబంధించిన వీడియోలో తళుక్కున మెరిశారు.

Updated Date - May 03 , 2024 | 02:53 AM