Share News

పాకిస్థాన్‌ 211 ఆలౌట్‌

ABN , Publish Date - Dec 27 , 2024 | 02:01 AM

పేసర్‌ డేన్‌ పాటర్సన్‌ (5/61) ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ 211 పరుగులకే ఆలౌటైంది. కమ్రాన్‌ గులామ్‌ (54) రాణించాడు...

పాకిస్థాన్‌ 211 ఆలౌట్‌

దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్‌

సెంచూరియన్‌ : పేసర్‌ డేన్‌ పాటర్సన్‌ (5/61) ఐదు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌ 211 పరుగులకే ఆలౌటైంది. కమ్రాన్‌ గులామ్‌ (54) రాణించాడు. మరో పేసర్‌ కార్బిన్‌ బాష్‌ (4/63) నాలుగు వికెట్లు సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా ఆట ఆఖరికి మూడు వికెట్లకు 82 పరుగులు చేసింది. కాగా

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ క్రికెట్‌ మూడు ఫార్మాట్లలో నాలుగు వేలకుపైగా పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈక్రమంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ సరసన చేరాడు

Updated Date - Dec 27 , 2024 | 02:01 AM