Jasprit Bumrah: బుమ్రా టెస్ట్‌లను వదిలేసి షార్ట్ ఫార్మాట్‌కు పరిమితమైతే మంచిది: షోయబ్ అక్తర్
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:33 PM
జస్ప్రీత్ బుమ్రా ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ఉత్తమం అని పాకిస్తాన్ దిగ్గజం షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెడితే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగుతుందని సూచించాడు.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఎక్కువ కాలం కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్ట్ క్రికెట్‌కు (Test Cricket) వీడ్కోలు పలకడం ఉత్తమం అని పాకిస్తాన్ దిగ్గజం షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెడితే కెరీర్ ఎక్కువ కాలం కొనసాగుతుందని సూచించాడు. టెస్ట్ క్రికెట్‌కు ఫిట్‌నెస్ ఎక్కువ అవసరమని, లాంగ్ స్పెల్స్ వేయడం వల్ల బౌలర్లు గాయాలపాలవుతున్నారని పేర్కొన్నాడు. బుమ్రా ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్తర్ ఇచ్చిన సూచన చర్చనీయాంశంగా మారింది.
``టెస్ట్ క్రికెట్ కంటే టీ-20, వన్డే క్రికెట్ బుమ్రాకు బాగా నప్పుతాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు బాగా సరిపోతాడు. ఎందుకంటే డెత్ ఓవర్లలో, పవర్ ప్లేలో బంతిని రెండు వైపలా స్వింగ్ చేస్తూ పరుగులను నియంత్రించగలడు. టెస్ట్ క్రికెట్‌లో ఆ వ్యూహం పని చేయదు. సింగ్ అయ్యే బంతులను ఆడేందుకు బ్యాటర్లు ఇష్టపడరు. అప్పుడు లాంగ్ స్పెల్స్ వేగంగా బంతులేయాల్సి ఉంటుంది. అలా చేస్తే అతడు గాయపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేను బుమ్రా స్థానంలో ఉంటే టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగి టీ-20, వన్డేలకు పరిమితమయ్యేవాడిన``ని అక్తర్ అన్నాడు.
భారత క్రికెట్‌కే కాదు, ప్రపంచ క్రికెట్‌కు కూడా బుమ్రా గొప్ప ఆస్తి అని, అతడిని కాపాడుకోవాలని అక్తర్ పేర్కొన్నాడు. ఐపీఎల్, వన్డేలు, టెస్ట్‌లు ఆడాలనుకోవడం మంచిది కాదని, శరీరం తీవ్రంగా అలసిపోయి త్వరగా కెరీర్‌ను ముగించాల్సి వస్తుందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బుమ్రా కీలక బౌలర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..