Share News

Zainab Ali Naqvi: ప్రాక్టీస్ సెషన్ తర్వాత బాత్రూంలోకి వెళ్లిన టెన్నిస్ ప్లేయర్.. కట్ చేస్తే విషాదం

ABN , Publish Date - Feb 15 , 2024 | 05:16 PM

పాకిస్తాన్ క్రీడారంగంలో విషాదం చోటు చేసుకుంది. పాక్ టెన్నిస్ సంచలనం జైన‌బ్ అలీ న‌ఖ్వీ (23) సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఇస్లామాబాద్ టెన్నిస్ టోర్నమెంట్ (ITF) టోర్న‌మెంట్ కోసం ఇస్లామాబాద్‌లోని త‌న ఇంటి వద్దే సిద్ధమవుతున్న ఆమె.. ప్రాక్టీస్ సెషన్ అనంతరం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది.

Zainab Ali Naqvi: ప్రాక్టీస్ సెషన్ తర్వాత బాత్రూంలోకి వెళ్లిన టెన్నిస్ ప్లేయర్.. కట్ చేస్తే విషాదం

పాకిస్తాన్ క్రీడారంగంలో విషాదం చోటు చేసుకుంది. పాక్ టెన్నిస్ సంచలనం జైన‌బ్ అలీ న‌ఖ్వీ (23) సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఇస్లామాబాద్ టెన్నిస్ టోర్నమెంట్ (ITF) టోర్న‌మెంట్ కోసం ఇస్లామాబాద్‌లోని త‌న ఇంటి వద్దే సిద్ధమవుతున్న ఆమె.. ప్రాక్టీస్ సెషన్ అనంతరం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. అక్కడే తనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆమె కుప్పకూలింది. జైనబ్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు బాత్రూంలోకి వెళ్లి చూశారు. లోపల అచేతన స్థితిలో పడి ఉన్న జైనబ్‌ను చూసి భయపడ్డ కుటుంబీకులు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.


నివేదికల ప్రకారం.. హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతితో జైనబ్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో గుండె కండరం మందంగా మారుతుందని, అప్పుడు గుండెకు రక్తాన్ని పంప్ చేయడం కష్టమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ పరిస్థితిని తరచుగా నిర్ధారించలేమని, ఎందుకంటే ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ తక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. కాగా.. జైనబ్ మరణవార్త తెలియగానే బంధువులు, స్నేహితులతో పాటు క్రీడాభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. పాక్ టెన్నిస్ స‌మాఖ్య సైతం జైనబ్ అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది. త్వ‌ర‌లో జ‌రిగే ఐటీఎఫ్ 30 టోర్న‌మెంట్‌కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించింది.

ఇదిలావుండగా.. జైనబ్ తండ్రి కూడా ఒక టెన్నిస్ ప్లేయరే. ఆయన్ను చూస్తూ పెరిగిన ఆమె, తనకు ఆరేళ్లు ఉన్నప్పుడే టెన్నిస్ ఆడటం మొదలుపెట్టింది. జూనియ‌ర్ స్థాయిలో ఎక్కువ‌గా సింగిల్స్ ఆడిన ఆమె.. ఏటీఎఫ్ అండ‌ర్ -14 సూప‌ర్ సిరీస్ టెన్నిస్ చాంపియ‌న్‌షిప్స్ ట్రోఫీ గెలిచింది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త్‌కు చెందిన వ‌ర్షా దాస్‌ను ఓడించింది. ఆరోజే జైన‌బ్ పేరు పాకిస్థాన్‌లో మార్మోగిపోయింది. 2022లో పాక్ త‌ర‌ఫున జూనియ‌ర్ టెన్నిస్ చాంపియ‌న్‌షిప్స్‌లో ఆడిన ఆమె.. బ‌లూచిస్థాన్‌లో జరిగిన నేష‌న‌ల్ గేమ్స్‌లోనూ పాల్గొంది.

Updated Date - Feb 15 , 2024 | 05:16 PM