Share News

పంత్‌, గిల్‌ ఆడతారు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:12 AM

న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్టు పరాభవం తర్వాత భారత జట్టు తుది కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మెడ కండరాలు పట్టేయడంతో శుభ్‌మన్‌ గిల్‌ ఆ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అలాగే వికెట్‌ కీపర్‌...

పంత్‌, గిల్‌ ఆడతారు

  • రాహుల్‌పై నమ్మకముంది

  • అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌డష్కాటే

పుణె: న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్టు పరాభవం తర్వాత భారత జట్టు తుది కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మెడ కండరాలు పట్టేయడంతో శుభ్‌మన్‌ గిల్‌ ఆ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. అలాగే వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ మోకాలికి బంతి బలంగా తాకడంతో మైదానం వీడాల్సి వచ్చింది. తిరిగి బ్యాటింగ్‌ చేసినా కీపింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఈనేపథ్యంలో గురువారం నుంచి పుణెలో జరిగే రెండో టెస్టులో వీరిద్దరూ ఆడతారా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే ఈ ఊహాగానాలకు తెరదించాడు. కివీ్‌సతో రెండో టెస్టులో గిల్‌, పంత్‌ ఆడతారని తేల్చాడు. ‘పంత్‌ బాగానే ఉన్నాడు. మోకాలు కదిలించడంలో కాస్త అసౌకర్యానికి గురైనా ప్రస్తుతం కోలుకున్నాడు. రెండో టెస్టు ఆడతాడనే భావిస్తున్నాం. ఇక గిల్‌ బెంగళూరు నెట్స్‌లో కూడా పాల్గొని బ్యాటింగ్‌ చేశాడు. కాస్త అసౌకర్యంగా కనిపిస్తున్నా మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నాడు’ అని టెన్‌డష్కాటే తెలిపాడు.


మరోవైపు పంత్‌ విషయంలో ఎలాంటి రిస్కూ తీసుకోకూడదన్న భావ నలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉంది. రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో అతడి మోకాలికి తీవ్ర గాయమైంది. ఇప్పుడు అక్కడే బంతి తాకడంతో ముందు జాగ్రత్తగా విశ్రాంతినిస్తే బావుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఆడించినా బ్యాటింగ్‌ మాత్రమే చేయించి కీపింగ్‌ బాధ్యతలు జురెల్‌కు అప్పగించే అవకాశముంది. మంగళవారం నెట్స్‌లో జురెల్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం కనిపించింది. మరోవైపు పంత్‌ స్పిన్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ సాధన కొనసాగించాడు.

Updated Date - Oct 23 , 2024 | 01:12 AM