పంత్‌కు రూ. 24 లక్షల జరిమానా
ABN , Publish Date - Apr 05 , 2024 | 01:59 AM
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండోసారి ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడంతో జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించారు. కోల్‌కతాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో...
విశాఖపట్నం: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండోసారి ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడంతో జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించారు. కోల్‌కతాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడ్డారు. దీంతో నిబంఽధల ప్రకారం రిషభ్‌కు రూ. 24 లక్షలు.. జట్టు సభ్యుల మ్యాచ్‌ల ఫీజులో 25 శాతం కోత విధించినట్టు ఐపీఎల్ గురువారం తెలిపింది. కాగా, ఈ మ్యాచ్‌లో 272 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా.. 106 రన్స్‌తో ఢిల్లీని ఓడించింది. అయితే, కొండంత స్కోరు కారణంగా క్యాపిటల్స్ ఓటమి ముందుగానే ఖరారైందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. కానీ, అర్ధ శతకం చేసిన రిషభ్.. తన వికెట్‌ను పారేసుకోకుండా మరింత సమయం క్రీజులో నిలిచి సెంచరీ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.