Share News

Paris Olympics 2024: బాక్సింగ్ మ్యాచ్‌లో లవ్లీనా విజయం.. పతకానికి మరో అడుగు దూరంలో..

ABN , Publish Date - Jul 31 , 2024 | 07:05 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ పతకం సాధించే దిశగా దూసుకుపోతోంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కూడా ఆమె విజయం సాధిస్తే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో మరో పతకం కూడా ఖాయమైనట్టే.

Paris Olympics 2024: బాక్సింగ్ మ్యాచ్‌లో లవ్లీనా విజయం.. పతకానికి మరో అడుగు దూరంలో..
Lovlina Borgohain

పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో భారత అథ్లెట్లు అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ (Lovlina Borgohain) పతకం సాధించే దిశగా దూసుకుపోతోంది. ఆదివారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో కూడా ఆమె విజయం సాధిస్తే భారత్‌కు ఈ ఒలింపిక్స్‌లో మరో పతకం (Medal) కూడా ఖాయమైనట్టే. 75 కేజీల విభాగం రౌండ్ 16 మ్యాచ్‌లో నార్వేకు చెందిన క్రీడాకారిణి సునీవాపై లవ్లీనా సునాయాస విజయం సాధించింది. 5-0తో ప్రత్యర్థిని మట్టి కరిపించి తర్వాతి దశకు చేరుకుంది.


ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం చైనా క్రీడాకారిణి లి కియాన్‌తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లవ్లీనా తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా నెగ్గితే భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలవడం లవ్లీనాకు అంత సులభం కాదు. గత రెండు ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించిన కియాన్‌తో గెలవాలంటే లవ్లీన్ అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంది. కియాన్ 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. కాగా, లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది.


ఇక, ఆర్చరీ విభాగంలో భారత క్రీడాకారిణి దీపికా కుమారి 16వ రౌండ్‌కు చేరుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన క్రీడాకారిణి క్వింటీ రౌఫెన్‌పై 6-2తో సునాయాస విజయం సాధించి తర్వాత దశకు చేరుకుంది. ఇక, భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్‌ కూడా విజయాలు అందుకుని తర్వాతి దశలకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: కోహ్లీకి ఘోర అవమానం.. ప్రాక్టీస్ చేస్తుండగా అలా గేలి చేయడంతో సీరియస్.. వీడియో వైరల్!


ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని బీట్ చేసిన జైస్వాల్.. ఇక రోహిత్ శర్మ..


Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న లక్ష్యసేన్..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2024 | 07:05 PM