Share News

Paris Olympics: ఇతని వ్యక్తిత్వం ముందు ఒలింపిక్ పతకం చిన్నబోయింది..!

ABN , Publish Date - Aug 09 , 2024 | 10:55 AM

మనిషి కృత్రిమంగా బ్రతికేస్తున్న ఈ కాలంలో తన వ్యక్తిత్వం ద్వారా ప్రపంచానికి దైవత్వం అంటే ఎలా ఉంటుందో చూపించాడు ఇవాన్ ఫెర్నాండెజ్.. ఆటతో కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇతను ఎవరు? ఏం చేశాడంటే..

Paris Olympics: ఇతని వ్యక్తిత్వం ముందు ఒలింపిక్ పతకం చిన్నబోయింది..!
Paris Olympics

పోటీ అంటేనే గెలుపోటముల దోబూచులాట. గెలుపే ధ్యేయంగా పోరాడేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం పక్కవాడిని వెనక్కు లాగేవారు కూడా కొందరు. కానీ తనకంటే ముందున్నవాడు ఓడిపోకూడదని, అర్హతను గుర్తించి గెలుపు అంచు వరకు లాక్కేళ్లేవారు బహుశా కొద్దిమందే ఉంటారు. ఇలాంటి వారి వ్యక్తిత్వం ముందు ఏ ఆట, ఏ పోటీ కూడా సమతూకం కాదు. అలాంటి వ్యక్తిత్వం పారిస్ ఒలింపిక్స్ లో తళుక్కుమంది. మనిషి కృత్రిమంగా బ్రతికేస్తున్న ఈ కాలంలో తన వ్యక్తిత్వం ద్వారా ప్రపంచానికి దైవత్వం అంటే ఎలా ఉంటుందో చూపించాడు ఇవాన్ ఫెర్నాండెజ్.. ఆటతో కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇతని గురించి, పారిస్ ఒలింపిక్స్ లో చోటు చేసుకున్న సంఘటన గురించి తెలుసుకుంటే..

Collagen Foods: ఈ 5 ఆహారాలు తప్పనిసరిగా తినండి.. కొల్లాజెన్ పెరిగి యవ్వనంగా కనిపిస్తారు..!



ప్రతి రంగానికి ఓ గొప్ప లక్ష్యం ఉంటుంది. సినిమా ప్రపంచానికి ఆస్కార్ అవార్డు, కొన్ని రంగాలకు నోబుల్ ఫ్రైజ్, క్రీడలకు ఒలింపిక్ పతకాలు ఇలా.. ఆయా రంగాలలో నిష్టాతులకు గుర్తింపు ఇస్తాయి. ప్రస్తుతం పారిస్ లో ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

కెన్యా ఆటగాడు(Kenya athlete) అబెల్ ముతాయ్(Abel Mutai) రన్నింగ్ రేసు(Running race)లో ముందున్నాడు, గెలుపు వైపుకు పరుగు పెడుతున్నాడు. తన ముందున్న ఒక గీతను చూసి అదే ఫినిషింగ్ లైన్(Finishing line) అని పొరబడ్డాడు. పరుగు పూర్తైందనే ఆలోచనతో ఆగిపోయాడు. అతను కెన్యా ఆటగాడు.. అతనిలో పరిగెత్తే ప్రతిభ ఉంది కాని అతనికి పారిస్ స్థానిక భాష తెలియదు. దీంతో అతను విన్నింగ్ లైన్ అదే అనుకున్నాడు. అతని వెనుకే స్పానిష్ కు చెందిన ఇవాన్ ఫెర్నాండెజ్(Spanish Athlete Ivan Fernandez) పరిగెడుతూ వస్తున్నాడు. అతను అబెల్ ముతాయ్ ను పట్టించుకోకుండా ముందుకు పరిగెత్తి ఉంటే పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలిచేవాడు. కానీ అతను ఆ పని చేయలేదు. అతనిలో ఉన్న మానవత్వం అతన్ని ముందుకు వెళ్లనివ్వలేదు. అతను నేరుగా అబెల్ ముతాయ్ వీపును తడుతూ "విజయం కోసం ఇంకా పరిగెత్తాలి.. పరిగెత్తు" అని అబెల్ ముతాయ్ ని ముందుకు ప్రోత్సహించాడు. ఫలితంగా అబెల్ ముతాయ్ అసలైన ఫినిషింగ్ లైన్ ను చేరుకుని పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించాడు. ఇవాన్ ఫెర్నాండెజ్ రన్నరప్ గా నిలిచాడు.

Water poisoning: నీరు కూడా విషంలా పనిచేస్తుందా? ఎవరికి ఇలా జరిగే అవకాశం ఉంటుందంటే..!



ఈ సంఘటన జరిగిన తరువాత ఓ జర్నలిస్టు ఇవాన్ ఫెర్నాండెజ్ ను ఇంటర్ప్వూ చేశాడు. జర్నలిస్ట్ కు, ఇవాన్ కు మధ్య జరిగిన సంభాషణ మనిషిలో ఉండే దైవత్వాన్ని తెలియజేస్తుంది. వారి సంభాషణ ఇలా సాగింది..

  • జర్నలిస్టు : " మీరు అలా ఎందుకు చేశారు "

  • ఇవాన్ ఫెర్నాండెజ్ : "ఏదో ఒకరోజు మనం ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకుంటూ అందరం గెలిచే సమాజం కోసం అలా చేశాను."

  • జర్నలిస్ట్: "మీరు ఆ కెన్యా రన్నర్ కు మీకు రావలసిన బంగారు పతకం ధార పోశారు తెలుసా ?"

  • ఇవాన్ : "నేనేం అతనికి సహాయం చేయలేదు. ఈ రేసు అతను గెలవబోతున్నాడు. కేవలం భాష రాకపోవటం వలన ఆయన ఆగాడు."

  • జర్నలిస్ట్: "కానీ మీరు గెలిచేవారే కదా !"

  • ఇవాన్ : "అవును. బంగారు పతకం గెలిచేవాడినే. కానీ ఆ బంగారు పతకానికి అప్పుడు ఏమి విలువ ఉంటుంది."

  • జర్నలిస్టు ఇవాన్ ని వదలకుండా ప్రశ్నిస్తునే ఉన్నాడు.

Paneer: మీకు పనీర్ అంటే బాగా ఇష్టమా? ఈ 6 సమస్యలున్నవారు పొరపాటున కూడా తినకూడదట..!



  • జర్నలిస్ట్ : 'మీరు బంగారు పతకాన్ని గెలిచేవారే కదా ?"

  • ఇవాన్ : "ఆ గెలుపుకు విలువేమున్నది ? నా తల్లి నా గురించి ఏమనుకుంటుంది ? మానవీయ విలువలు ఒక తరం నుండి మరో తరానికి పెరుగుతూ అందింపబడాలి. మన పిల్లలకు మనం అదే నేర్పాలి. మన పిల్లలకు మనం సరైన మార్గంలో వెళ్ళడం నేర్పాలి. తప్పు మార్గంలో వెళ్ళి గెలవడం మన పిల్లలకు నేర్పకూడదు. అలా కాకుండా మానవీయ విలువలు పెంచుతూ ఒకరికొకరం సహాయ పడుతూ పురోగమించాలి. ఎందుకంటే నిజాయితీ, నైతిక విలువలే ఎప్పుడూ విజయం సాధిస్తాయి."

ఇవాన్ ఫెర్నాండేజ్ చెప్పన మాటలకు జర్నలిస్ట్ మరింకేమీ మాట్లాడలేక పోయాడు. ఒక మనిషి వ్యక్తిత్వంలో దైవత్వం కనిపించాక.. ఇవాన్ ను ప్రశ్నించడానికి ఆ జర్నలిస్ట్ దగ్గర ప్రశ్నలేకపోయిందేమో.. ఇవాన్ వ్యక్తిత్వం ముందు ఆ ఒలింపిక్ బంగారు పతకం చిన్నబోయిందని జర్నలిస్ట్ కు కూడా అర్థమైందేమో!

Olympics 2024: అర్షద్ నదీమ్ కూడా మన బిడ్డే..!!


హాకీకి.. పతక హారతి


మరిన్ని క్రీడా వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 09 , 2024 | 11:01 AM