Paralympics : లక్ష్యం 12
ABN , Publish Date - Aug 22 , 2024 | 06:38 AM
పారిస్ పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీలలో ఐదు స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు గెలవాలని మనోళ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈమేరకు స్టార్ జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌తో కూడిన 16 మంది భారత అథ్లెటిక్స్ తొలి బృందం బుధవారం పారిస్ పయనమైంది. ఈనెల 28న క్రీడలు
అథ్లెటిక్స్‌లో పతకాలపై భారీ ఆశలు
పారిస్ పారాలింపిక్స్
న్యూఢిల్లీ: పారిస్ పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీలలో ఐదు స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు గెలవాలని మనోళ్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈమేరకు స్టార్ జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌తో కూడిన 16 మంది భారత అథ్లెటిక్స్ తొలి బృందం బుధవారం పారిస్ పయనమైంది. ఈనెల 28న క్రీడలు ప్రారంభం కానున్నా..పారి్‌సలో పరిస్థితులకు అలవాటు పడేందుకు మన ఆటగాళ్లు ముందుగానే అక్కడకు బయల్దేరారు. పారాలింపిక్స్‌లో అథ్లెటిక్ పోటీలు ఈనెల 30 నుంచి వచ్చేనెల ఎనిమిది వరకు స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో నిర్వహిస్తారు. ‘పారి్‌సలోని నెల్సన్ మండేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సుమిత్ తదితర అథ్లెట్లు సాధన చేస్తారు’ అని పారా అథ్లెటిక్స్ జట్టు ప్రధాన కోచ్ సత్యనారాయణ తెలిపారు. ‘అథ్లెటిక్స్‌లో ‘కనీసం ఐదు సర్ణాలు సహా మొత్తం 12 పతకాలు గెలుపొందగలమని భావిస్తున్నాం. అదే జరిగితే పారాలింపిక్స్‌లో మనది అత్యుత్తమ ప్రదర్శన అవుతుంది’ అని సత్యనారాయణ చెప్పారు. గత మేలో జపాన్‌లోని కోబెలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్సలో భారత్ ఆరు స్వర్ణ, ఐదు రజత, ఆరు కాంస్యాలతో కలిసి మొత్తం 17 పతకాలతో పట్టికలో ఆరో స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలో అద్భుత ప్రదర్శన పారాలింపిక్స్‌లో మనోళ్ల ప్రదర్శనపై భారీ అంచనాలు పెంచింది. ఇక టోక్యో పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో భారత్ ఓవరాల్‌గా 19 పతకాలు (ఐదు స్వర్ణ, ఎనిమిది రజత, ఆరు కాంస్యాలు) సొంతం చేసుకుంది. ఈసారి పారాలింపిక్స్‌కు 84 మందితో కూడిన భారీ బృందాన్ని బరిలో దించుతోంది. 12 క్రీడాంశాల్లో మనోళ్లు తలపడుతున్నారు. అథ్లెటిక్స్‌లో 38 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పారి్‌సలో ఓవరాల్‌గా కనీసం 25 పతకాలు సాధించగలమని భారత పారాలింపిక్స్ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అంచనా వేస్తున్నాడు.
టైటిల్‌పై గురి
ఈసారి పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్, డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. కొన్నాళ్లుగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 26 ఏళ్ల సుమిత్.. పారిస్‌లో కచ్చితంగా స్వర్ణం గెలవడన్న అంచనాలున్నాయి. జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడుతున్న సుమిత్.. 2021 టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్‌ను 68.55 మీటర్లు త్రో చేసి రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. ఆ మరుసటి ఏడాది హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా పారాక్రీడల్లో జావెలిన్‌ను ఏకంగా 73.29 మీటర్లు విసిరి విజేతగా నిలిచిన సుమిత్.. సరికొత్త ప్రపంచ రికార్డుతో తనప్రదర్శనను మరింత మెరుగుపరచుకున్నాడు. నిరుడు పారిస్‌లో నిర్వహించిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లోనూ సత్తాచాటుతూ 70.83 మీటర్లతో సుమిత్ బంగారు పతకం కొల్లగొట్టాడు. ఇక.. ఈ ఏడాది జపాన్‌లోని కోబెలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 69.50 మీటర్లకే పరిమితమైనా, టైటిల్ నిలబెట్టుకొని తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే, పారిస్ పారాలింపిక్స్‌లో కచ్చితంగా 75 మీటర్ల ప్రదర్శనతో సరికొత్త రికార్డు నెలకొల్పగలడన్న ధీమాను సుమిత్ వ్యక్తం చేస్తున్నాడు.