Portugal : నాకౌట్‌కు పోర్చుగల్
ABN , Publish Date - Jun 23 , 2024 | 06:18 AM
యూరో చాంపియన్‌షి్‌పలో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఎ్‌ఫలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0తో తుర్కియేను చిత్తుచేసింది. పోర్చుగల్
యూరో చాంపియన్‌షిప్
డార్ట్‌మండ్ (జర్మనీ): యూరో చాంపియన్‌షి్‌పలో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఎ్‌ఫలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0తో తుర్కియేను చిత్తుచేసింది. పోర్చుగల్ జట్టులో సిల్వా (21వ), అకేడిన్ (28వ), ఫెర్నాండెజ్ (56వ) తలో గోల్ సాధించారు. తన గ్రూపులో వరుసగా రెండు విజయాలు నమోదుచేసిన పోర్చుగల్ 6 పాయింట్లతో నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక, ఫ్రాన్స్-నెదర్లాండ్స్ గ్రూపు దశ బ్లాక్‌బస్టర్ పోరు 0-0తో డ్రాగా ముగిసింది. గ్రూప్ ‘డి’లో అత్యంత బలమైన ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సాకర్ ఫ్యాన్స్‌కు మస్తు మజా పంచింది. ఫ్రాన్స్-నెదర్లాండ్స్ నువ్వా..నేనా..అనేలా తలపడడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాకుండానే పోరు ముగియడం విశేషం. అయితే 69వ నిమిషంలో డచ్ మిడ్‌ఫీల్డర్ సిమోన్స్ గోల్ కొట్టినా..రెఫరీ ‘ఆఫ్‌సైడ్’గా ప్రకటించాడు. గ్రూప్ ‘ఎఫ్’లో చెక్ రిపబ్లిక్-జార్జియా మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది.