Share News

యుద్ధభూమిలోనే ప్రాక్టీస్‌ చేసి..

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:18 AM

రెండేళ్లుగా ఆ దేశంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే.. ఏవైపు ఉంచి ఎప్పుడు మిస్సైల్స్‌ వచ్చి పడతాయో తెలీని భీతావహం. కళ్ల ముందే ఎంతోమంది ప్రాణాలు విడిచే భయంకర దృశ్యాలు. దీనికి తోడు పవర్‌ గ్రిడ్‌ కూల్చివేతతో

యుద్ధభూమిలోనే ప్రాక్టీస్‌ చేసి..

పారిస్‌: రెండేళ్లుగా ఆ దేశంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే.. ఏవైపు ఉంచి ఎప్పుడు మిస్సైల్స్‌ వచ్చి పడతాయో తెలీని భీతావహం. కళ్ల ముందే ఎంతోమంది ప్రాణాలు విడిచే భయంకర దృశ్యాలు. దీనికి తోడు పవర్‌ గ్రిడ్‌ కూల్చివేతతో దాదాపుగా విద్యుత్‌ లేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట స్థితిలోనూ ఉక్రెయిన్‌ నుంచి 143 మంది అథ్లెట్ల బృందం ఒలింపిక్స్‌కు రాగలిగింది. రష్యాతో నిరంతర యుద్ధంతో ఈ దేశం సతమతమవుతున్న విషయం తెలిసిందే. హఠాత్తుగా వచ్చే సైరన్ల మోతతో తాముు ఇంట్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచ్చేదని, అందుకే తమ శిక్షణ అత్యంత కష్టంగా సాగిందని అథ్లెట్లు చెబుతున్నారు. అలాగే దేశం తరఫున ఒలింపిక్స్‌లో ఆడడాన్ని గర్వంగా భావిస్తున్నాంటున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 06:18 AM