ప్రజ్ఞానంద గెలుపు
ABN , Publish Date - Apr 12 , 2024 | 03:08 AM
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్ జీఎం నిజత్ అబసోవ్‌పై...
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్ జీఎం నిజత్ అబసోవ్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. మరో గేమ్‌లో అలీరెజా (ఫ్రాన్స్)పై విదిత్ నెగ్గాడు. కాగా, హికరు నకమురా (అమెరికా)తో గుకేష్ పాయింట్ పంచుకొన్నాడు. మొత్తం 6 రౌండ్ల నుంచి గుకేష్ 4 పాయింట్లతో సంయుక్తంగా టాప్‌లో కొనసాగుతుండగా.. ప్రజ్ఞానంద (3.5), గుజరాతి (3) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. కాగా, మహిళల విభాగం ఆరో రౌండ్‌లో లీ టింగ్జీ (చైనా) చేతిలో కోనేరు హంపి, కటిర్యానా చేతిలో వైశాలి పరాజయం పాలయ్యారు.