Pro Kabaddi 2024: ప్రొ కబడ్డీ 2024 ఫైనల్ విజేత హర్యానా స్టీలర్స్
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:19 PM
Pro Kabaddi 2024: ప్రొ కబడ్డీ 2024 ఫైనల్స్‌లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై హర్యానా జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32-23తో విజయం సాధించింది.
Pro Kabaddi League 2024: ప్రొ కబడ్డీ 2024 ఫైనల్స్‌లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై హర్యానా జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 32-23తో విజయం సాధించింది. తొలిసారిగా హర్యానా జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మూడుసార్లు చాంపియన్‌గా ఉన్న పాట్నా పైరేట్స్ రికార్డుతో నాలుగోసారి టైటిల్ సాధించాలని అనుకుంది.. కానీ పాట్నా కల నెరవేరకపోవడంతో ఆ జట్టు క్రీడాకారులు నైరాశ్యంలో ఉన్నారు. చివరి మ్యాచ్‌లో శివమ్ పటారే హర్యానా తరఫున అత్యధికంగా 9 పాయింట్లు సాధించాడు. ఇదికాకుండా 7 పాయింట్లను మహ్మద్రెజా షాద్లు సాధించాడు. అలాగే, పాట్నా పైరేట్స్ తరఫున గురుదీప్‌కు 6 పాయింట్లు వచ్చాయి. రెస్ట్ దేవాంక్, అయాన్‌ల ఆశలు నెరవేరలేదు.
హర్యానా స్టీలర్స్ డిఫెన్స్, రైడింగ్ రెండింటిలోనూ పాయింట్లు సాధించింది. కాగా పాట్నా పైరేట్స్ జట్టు కూడా చివరి వరకు గట్టి పోటీని ఇచ్చింది. డిఫెన్స్‌లో కూడా వారు ప్రతిభ కనబరిచారు. రెండు జట్ల రైడర్లు రాణించలేకపోయిన డిఫెండర్లు రాణించారు. దీంతో రెండు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఆట మొదలైన 10 నిమిషాల్లో హర్యానా జట్టు 2 పాయింట్లతో అధిక్యతను కనబరిచింది. అయితే, దీని తర్వాత అయాన్ మల్టీపాయింట్ తీసుకురావడం ద్వారా పాట్నా మళ్లీ తిరిగి పుంజుకుంది. రెండు జట్ల మధ్య పోటీ ఉత్కఠంగా మారింది. ఈ మ్యాచ్‌లో సగం ఆట అయిపోయే వరకు 15-12 స్కోరుతో హర్యానా స్టీలర్స్‌కు అనుకూలంగా మారింది.
ఆ తర్వాత ద్వితీయార్థంలోనూ రెండు జట్ల మధ్య పోటీ ఉత్కఠంగా మారింది. అయితే హర్యానా జట్టు ఆధిక్యతను కనబరచడంతో పాట్నా పైరేట్స్ రైడర్‌లు ఢీలాపడిపోయారు. ఆట మొదలైన తొలి అరగంటలో దేవాంక్‌కు కేవలం 2 పాయింట్లు మాత్రమే రాగా, అయాన్ రెండు పాయింట్లు మాత్రమే సాధించారు. కాగా హర్యానా స్టీలర్స్‌కు చెందిన శివమ్ పటారే ఖచ్చితంగా 7 పాయింట్లు సాధించాడు. డిఫెన్స్‌లో హర్యానా స్టీలర్స్ తరఫున మహ్మద్రెజా షాద్లూ అద్భుతంగా రాణించారు. అతను ట్యాకిల్స్, రైడ్స్ రెండింటిలోనూ పాయింట్లు సాధించారు. మ్యాచ్‌లో ఎనిమిది నిమిషాల కంటే తక్కువ సమయం ఉండగానే, హర్యానా స్టీలర్స్ పాట్నా పైరేట్స్‌కు ఆలౌట్ చేసి మ్యాచ్‌లో దాదాపు 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. మ్యాచ్ ముగియడానికి 5 నిమిషాల కంటే తక్కువ సమయం ఉండగానే, హర్యానా ఆధిక్యం కనబరిచి 8 పాయింట్లు ఉండటంతో చివరకు మ్యాచ్‌లో విజయం సాధించారు.