Share News

Telugu Titans: తెలుగు టైటాన్స్‏కి స్పాన్సర్ నుంచి విశేష స్పందన

ABN , Publish Date - Oct 23 , 2024 | 05:39 PM

బెంగుళూరు బుల్స్‏పై గెలుపుతో తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11ను ప్రారంభించింది. అభిమానులకు.. తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్ (ఇండియా నేషనల్ కబడ్డీ కెప్టెన్) హై-ఫ్లైయర్ కబడ్డీ యాక్షన్తో నిండిన ఉత్సాహాన్ని ఇచ్చాడు.

Telugu Titans: తెలుగు టైటాన్స్‏కి స్పాన్సర్ నుంచి విశేష స్పందన

హైదరాబాద్: బెంగుళూరు బుల్స్‏పై గెలుపుతో తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11ను ప్రారంభించింది. అభిమానులకు.. తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్ (ఇండియా నేషనల్ కబడ్డీ కెప్టెన్) హై-ఫ్లైయర్ కబడ్డీ యాక్షన్తో నిండిన ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా టైటాన్స్ సీఈఓ త్రినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. "మా బృందంపై ఆసక్తిని ప్రదర్శిస్తూ అగ్రశ్రేణి వ్యాపార సంస్థలు భారీగా స్పందిస్తున్నాయి. దీన్ని మేం గౌరవంగా భావిస్తున్నాం. మాకు స్పాన్సర్ల మద్దతు ఎప్పుడూ ఉంటోంది. ఈ సీజన్ మాపై ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. రాబోయే సీజన్ కోసం మేం ఎదురు చూస్తున్నాం" అని త్రినాథ్ పేర్కొన్నారు.


Parksons Cartamundi ఎండీ, సీఈవో కపిల్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ కోసం తెలుగు టైటాన్స్తో చేతులు కలపడం సంతోషంగా ఉంది. భారత్ అంతటా మా ఉనికిని విస్తరిస్తున్నాం. తద్వారా స్వదేశీ క్రీడలకు మద్దతు లభిస్తుంది" అని తెలిపారు. ప్రో కబడ్డీ పది సీజన్లు విజయవంతమైన నేపథ్యంలో ‘ప్రో కబడ్డీ లీగ్’ పదకొండో సీజన్.. 18 అక్టోబర్ 2024న ప్రారంభమై స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, డిస్నీ+ హాట్ స్టార్లో ప్రదర్శితమవుతోంది. ఈ సీజన్ స్పాన్సర్లు ఎవరంటే..

Principal Sponsor: Bicycle, Co-sponsor with “am green”,

Associate Sponsors: Vipani.ai, Stuam, Lubi, Stonecraft WOODS, NED Sports, araku coffee,

Official Partner: Moo Chuu INDIA and Partners: PACE International and BCC United
Diwali 2024: దీపావళి ఏ రోజు? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?

For Latest News and National News Click here

Updated Date - Oct 23 , 2024 | 05:47 PM