Share News

సెమీస్‌లో యూపీ, పట్నా

ABN , Publish Date - Dec 27 , 2024 | 02:18 AM

ప్రొ.కబడ్డీ తాజా సీజన్‌ తుది అంకానికి వచ్చేసింది. సెమీఫైనల్లో తలపడే జట్లేవో తేలిపోయింది. శుక్రవారం జరిగే తొలి సెమీ్‌సలో హరియాణా స్టీలర్స్‌-యూపీ యోధా, రెండో సెమీఫైనల్లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ-పట్నా పైరేట్స్‌ ఢీకొంటాయి...

సెమీస్‌లో యూపీ, పట్నా

పుణె: ప్రొ.కబడ్డీ తాజా సీజన్‌ తుది అంకానికి వచ్చేసింది. సెమీఫైనల్లో తలపడే జట్లేవో తేలిపోయింది. శుక్రవారం జరిగే తొలి సెమీ్‌సలో హరియాణా స్టీలర్స్‌-యూపీ యోధా, రెండో సెమీఫైనల్లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ-పట్నా పైరేట్స్‌ ఢీకొంటాయి. గురువారం ఏకపక్షంగా జరిగిన ఎలిమినేటర్‌-1లో యూపీ యోధాస్‌ 46-18తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను చిత్తు చేసింది. భవానీ రాజ్‌పుత్‌ 12 పాయింట్లతో యూపీ విజయంలో కీలక భూమిక పోషించాడు. హితేష్‌ హై-5తో మెరిశాడు. ఎలిమినేటర్‌-2లో మూడుసార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ 31-23తో యు ముంబాపై గెలుపొందింది.

Updated Date - Dec 27 , 2024 | 02:18 AM