పుజార రికార్డు ‘డబుల్’
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:08 AM
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక (18) ద్విశతకాలు బాదిన నాలుగో ఆటగాడిగా వెటరన్ చటేశ్వర్ పుజార (234) రికార్డులకెక్కాడు. ఛత్తీ్‌సగఢ్‌తో సోమవారం డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు పుజార కెరీర్‌లో...
రాజ్‌కోట్: ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక (18) ద్విశతకాలు బాదిన నాలుగో ఆటగాడిగా వెటరన్ చటేశ్వర్ పుజార (234) రికార్డులకెక్కాడు. ఛత్తీ్‌సగఢ్‌తో సోమవారం డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు పుజార కెరీర్‌లో 18వ డబుల్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఛత్తీ్‌సగఢ్ 578/7 డిక్లేర్ చేయగా.. సౌరాష్ట్ర 8 వికెట్లకు 478 పరుగులు సాధించింది. కాగా, 21 వేల పరుగులు చేసిన పుజార.. గవాస్కర్, సచిన్, ద్రవిడ్ తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ మైలురాయిని చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. మరోవైపు అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన వారిలో డాన్ బ్రాడ్‌మన్ (37) టాప్‌లో ఉండగా.. వాలీ హమ్మండ్ (36), పాస్టీ హెండ్రెన్ (22) తర్వాతి స్థానంలో పుజార (18) చోటు దక్కించుకొన్నాడు.