Share News

Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధూ శుభారంభం

ABN , Publish Date - Jul 28 , 2024 | 02:06 PM

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ శుభారంభం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Paris Olympics 2024 PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధూ శుభారంభం

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ శుభారంభం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో తొలి మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. రెండు సార్లు ఒలింపిక్ విజేత, 10వ సీడ్ ప్లేయర్‌ అయిన సింధూ ముందు మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి రజాక్ నిలవలేకపోయింది. 21-9, 21-6 తేడాతో సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దూకుడై షాట్లతో రజాక్‌పై సింధూ విరుచుకుపడింది. ఈ విజయం ద్వారా సింధూ తన తదుపరి మ్యాచ్‌లకు ఆత్మ విశ్వాసం కూడగట్టుకున్నట్టయింది.


పారిస్ ఒలింపిక్స్‌ 2024(Paris Olympics 2024)లో తొలిరోజు భారత్‌కు(bharat) ఒక్క పతకం కూడా దక్కలేదు. 10 మీటర్ల ఉమెన్స్ షూటింగ్‌ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా మను భాకర్ (Manu bhaker) ఇప్పటికే రికార్డు సృష్టించింది. క్వాలిఫికేషన్‌లో 22 ఏళ్ల భాకర్ 580 పాయింట్లు చేసి మూడో స్థానంలో నిలువగా, హంగేరియన్ షూటర్ వెరోనికా మేజర్ 582 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఈ 22 ఏళ్ల యువతి ప్రదర్శనను బట్టి మెడల్ దాదాపు ఖారారు కానుంది.


తొలి స్వర్ణం చైనాదే

పారిస్‌ క్రీడల్లో మొదటి స్వర్ణాన్ని చైనా సొంతం చేసుకొంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో చైనా షూటర్లు హువాంగ్‌ యుటింగ్‌-షెంగ్‌ లిహావో విజయం సాధించారు. సౌత్‌ కొరియాకు చెందిన కియుంగ్‌ హయున్‌-పార్క్‌ హజున్‌ జంట రెండో స్థానంలో నిలిచింది. ఇక, తొలిరోజు పోటీల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌ జట్టు రెండు పతకాలు దక్కించుకుంది. జూడో క్రీడాంశంలో ఓ రజతం, కాంస్యం సాధించింది. ఆ దేశానికి చెందిన లుకా మెకద్జీ రజతం, షిరిన్‌ బౌక్లీ కాంస్య పతకం అందుకున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 02:09 PM