Share News

టాప్‌లో రబాడ

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:14 AM

ఐసీసీ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ బుమ్రా మూడో స్థానానికి దిగజారాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ రబాడ..బుమ్రా నుంచి టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు...

టాప్‌లో రబాడ

మూడో స్థానానికి బుమ్రా

దుబాయ్‌: ఐసీసీ టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ బుమ్రా మూడో స్థానానికి దిగజారాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ రబాడ..బుమ్రా నుంచి టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. ఆసీస్‌ పేసర్‌ హాజెల్‌వుడ్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రెండు ర్యాంక్‌లు తగ్గి నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌తో రెండో టెస్ట్‌లో 13 వికెట్లు సాధించిన కివీస్‌ స్పిన్నర్‌ శాంట్నర్‌ ఏకంగా 20 ర్యాంక్‌లు మెరుగుపరుచుకొని 44వ స్థానం కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో పంత్‌ 11, కోహ్లీ 14వ ర్యాంక్‌కు దిగజారారు. ఆల్‌రౌండర్లలో అశ్విన్‌, జడేజా తమ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 01:14 AM