Share News

Rahul Dravid: గుర్తొచ్చిందా.. వీడు మగాడ్రా బుజ్జీ.. 92 బంతులు.. ఒక్క పరుగు..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 10:07 AM

బ్యాట్స్‌మెన్ మైదానంలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను అతడు చేసిన పరుగులను బట్టి కొలుస్తాం. ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే అంత బాగా ఆడినట్టు భావిస్తుంటాం. అయితే టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అంత బాగా ఆడినట్టు లెక్క.

Rahul Dravid: గుర్తొచ్చిందా.. వీడు మగాడ్రా బుజ్జీ.. 92 బంతులు.. ఒక్క పరుగు..!
Rahul Dravid batting

బ్యాట్స్‌మెన్ మైదానంలో చేసిన అద్భుతమైన ప్రదర్శనను అతడు చేసిన పరుగులను బట్టి కొలుస్తాం. ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే అంత బాగా ఆడినట్టు భావిస్తుంటాం. అయితే టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే అంత బాగా ఆడినట్టు లెక్క. జట్టును ఓటమి నుంచి తప్పించాలంటే బ్యాటర్ క్రీజులో ఎక్కువ సేపు ఉండాల్సిందే. అలాంటి ఎన్నో ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్‌ను (Rahul Dravid) అందుకే ``ది వాల్`` అని పిలిచేవారు.


2007లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ (2007 Australia Test series)లో బ్రెట్‌లీ, మిచెల్ జాన్సన్, బ్రాడ్ హాగ్, ఆండ్రూ సైమండ్స్ వంటి టాప్ క్లాస్ బౌలర్లకు రాహుల్ ద్రవిడ్ చుక్కలు చూపించాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో 92 బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఆ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే అదే సిరీస్‌లో సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ద్రవిడ్ డిఫెన్స్‌కు ఆస్ట్రేలియా అభిమానులు సైతం ముగ్ధులయ్యారు (Rahul Dravid batting).


సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 96 బంతులు ఎదుర్కొన్న ద్రవిడ్ 18 పరుగులు చేశాడు. అనంతరం మరో పరుగు చేయడానికి ఏకంగా 40 బంతులు ఆడాడు. అంటే 18 నుంచి 19కి రావడానికి ద్రవిడ్ 40 బంతులు ఆడాడు. ఆ పరుగు చేసిన తర్వాత మైదానంలోని అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో ద్రవిడ్ సహనాన్ని అభినందించారు. వారిని ఉత్సాహపరిచేందుకు ద్రవిడ్ కూడా బ్యాట్ పైకి ఎత్తి అభివాదం చేశాడు. అంత నెమ్మదిగా ఆడే ద్రవిడ్ తాజా టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు మార్గనిర్దేశనం చేసి విజయవంతం కావడం విశేషం. డిఫెన్స్‌‌కు మారు పేరైన ద్రవిడ్ ఎటాకింగ్ గేమ్‌లో తమదైన మార్క్ చూపించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.


ఇవి కూడా చదవండి..

Watch Video:కప్పు అందుకునే సమయంలో అందుకే అలా నడిచా.. ప్రధానితో రోహిత్ ఏం చెప్పాడంటే..


టీమిండియాకు ‘మహా’ నజరానా రూ. 11 కోట్లు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 06 , 2024 | 11:44 AM