Share News

Watch Video:కప్పు అందుకునే సమయంలో అందుకే అలా నడిచా.. ప్రధానితో రోహిత్ ఏం చెప్పాడంటే..

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:17 PM

PM Modi with Teamindia: వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలు సాధించి టైటిల్ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ అభిమానులు క్రికెటర్లను చూసేందుకు ముంబైలో పొటెత్తారు. అంతకుముందు గురువారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీని భారత క్రికెటర్లు కలిశారు.

Watch Video:కప్పు అందుకునే సమయంలో అందుకే అలా నడిచా.. ప్రధానితో రోహిత్ ఏం చెప్పాడంటే..
Rohit sharma talks with PM Modi

వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో వరుస విజయాలు సాధించి టైటిల్ విన్నర్‌గా నిలిచిన టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. క్రికెట్ అభిమానులు క్రికెటర్లను చూసేందుకు ముంబైలో పోటెత్తారు. అంతకుముందు గురువారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మోదీ (PM Modi)ని భారత క్రికెటర్లు కలిశారు. ఆయనతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఆయన అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ వీడియోను తాజాగా బీసీసీఐ (BCCI) విడుదల చేసింది (PM Modi with Teamindia).


టీమిండియా క్రికెటర్లు అందరి అనుభవాలను అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ ముందుగా రోహిత్ శర్మ (Rohit Sharma)తో మాట్లాడారు. ``బార్బొడాస్ పిచ్ మట్టి రుచి ఎలా ఉంది`` అని రోహిత్‌ను అడిగారు. ఆ ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ.. ``మేం ఎక్కడ ఆడి విజేతలుగా నిలిచామో దానికి సంబంధించిన ఏదో ఒక జ్ఞాపకం నాకు కావాలనిపించింది. అది నాకు జీవితాంతం గుర్తుండాలనుకున్నా. అందుకే మట్టి తిన్నా. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూశాం. గత దశాబ్దకాలంగా ఎన్నో సార్లు చివరి వరకు వచ్చి నిరాశ చెందాం. కొన్ని కోట్ల మంది అభిమానుల కలలను అక్కడ నెరవేర్చాం`` అంటూ రోహిత్ పేర్కొన్నాడు.


అలాగే కప్పు అందుకునే సమయంలో రోహిత్ నడిచిన నడక గురించి కూడా ప్రధాని అడిగారు. దానికి రోహిత్ స్పందిస్తూ.. ``మేం విజేతలుగా నిలిచిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాం. సాధారణంగా నడుచుకుంటూ వచ్చి కప్పు తీసుకోవడం కాకుండా అలా నడిచి రావాలని కుల్దీప్ యాదవ్, చాహల్ చెప్పారు. అందుకే అలా చేశాన``ని రోహితే పేర్కొన్నాడు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత లియోనాల్ మెస్సీ, రిక్ ఫ్లెయర్ నడిచిన తీరులోనే రోహిత్ కూడా వాక్ చేసి కప్ అందుకున్నాడు.


ఇవి కూడా చదవండి..

అన్నంలో పాము.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ఆ ఇద్దరు మహిళలకు నా అభినందనలు..

Updated Date - Jul 05 , 2024 | 07:12 PM