వర్షార్పణం కెనడాతో భారత్ మ్యాచ్ రద్దు
ABN , Publish Date - Jun 16 , 2024 | 06:09 AM
ఫ్లోరిడాలో భారీ వర్షాలు టీ20 వరల్డ్‌క్‌పను వెంటాడుతున్నాయి. స్థానిక సెంట్రల్ బ్రోవర్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. శనివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా...
గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా
సూపర్-8లోకి రోహిత్ సేన
లాడర్‌హిల్: ఫ్లోరిడాలో భారీ వర్షాలు టీ20 వరల్డ్‌క్‌పను వెంటాడుతున్నాయి. స్థానిక సెంట్రల్ బ్రోవర్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో వరుసగా రెండో మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. శనివారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా భారత్-కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే ముగిసింది. శుక్రవారం యూఎ్‌స-ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్‌లో ఏడు పాయింట్లతో రోహిత్ సేన టాప్‌లో ఉండగా.. ఆతిథ్య యూఎస్‌ఏ ఐదు పాయింట్లతో ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇక సూపర్-8లో ఈనెల 20న బ్రిడ్జిటౌన్‌లో అఫ్ఘాన్‌తో భారత్ తలపడనుంది. కెనడాతో ఆడాల్సిన పోరు నామమాత్రమే అయినా.. కరీబియన్ వెళ్లడానికి ముందు భారత్‌కు ఇది చక్కటి మ్యాచ్ ప్రాక్టీస్ లభించినట్టయ్యేది. వాస్తవానికి మ్యాచ్ సమయానికి వర్షం ఆగిపోయినా అవుట్ ఫీల్డ్ మాత్రం పూర్తి చిత్తడిగా మారింది.
అప్పటికీ సిబ్బంది భారీ హెయిర్ డ్రయర్స్‌తో పొడిగా మార్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆకాశం మేఘావృతంగా ఉండడంతో సూర్యుడి వెలుతురు కరువైంది. అటు అంపైర్లు రెండుసార్లు పరీక్షించినా ఆడేందుకు అనుకూలంగా కనిపించలేదు. దీంతో రాత్రి 9 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
పాయింట్ల పట్టిక గ్రూప్-ఎ
జటు మ్యా గె ఓ ఫ.తే పా రన్‌రేట్
భారత్ 4 3 0 1 7 1.137
అమెరికా 4 2 1 1 5 0.127
కెనడా 4 1 2 1 3 -0.493
పాకిస్థాన్ 3 1 2 0 2 0.191
ఐర్లాండ్ 3 0 2 1 1 -1.712
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; పా: పాయింట్లు