వాలీబాల్ విజేత రంగారెడ్డి
ABN , Publish Date - Feb 12 , 2024 | 02:33 AM
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విజయ్ దేవరకొండ (వీడీ) వాలీబాల్ ఓపెన్‌లో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆ జట్టు 15-7, 15-11తో నెల్లూరును...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విజయ్ దేవరకొండ (వీడీ) వాలీబాల్ ఓపెన్‌లో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆ జట్టు 15-7, 15-11తో నెల్లూరును ఓడించింది. వాలీబాల్ లీగ్‌లోని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు జెర్సీని ఆ టీమ్ సహ యజమాని, సినీ హీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. విజయ్, బ్లాక్‌హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు బహూకరించారు.