Share News

రికార్డులే నా వెంటపడతాయి!

ABN , Publish Date - May 29 , 2024 | 06:23 AM

సౌదీ ప్రొ లీగ్‌లో ఒక సీజన్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో మొత్తం 35 గోల్స్‌ సాధించిన...

రికార్డులే నా వెంటపడతాయి!

న్యూఢిల్లీ: సౌదీ ప్రొ లీగ్‌లో ఒక సీజన్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడిగా పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో మొత్తం 35 గోల్స్‌ సాధించిన రొనాల్డో.. 2018-19లో అద్రెజక్‌ హందల్లా (మొరాకో) 34 గోల్స్‌ రికార్డును అధిగమించాడు. కాగా అల్‌ నాసర్‌ 4-2తో ఇత్తెహాద్‌పై గెలిచిన అనంతరం ఎక్స్‌ వేదికగా రొనాల్డో సరదాగా సంబరాలు చేసుకొన్నాడు. ‘రికార్డుల వెంట నేను పడను.. నా వెనుకే రికార్డులు వస్తాయ’ని మాస్‌ మెసేజ్‌ పోస్టు చేశాడు.

Updated Date - May 29 , 2024 | 06:23 AM