Olympics : ఈసారి అథ్లెటిక్స్‌లో ‘రెపిచేజ్’
ABN , Publish Date - Aug 01 , 2024 | 12:51 AM
రెపిచేజ్..ఇప్పటికే కొన్ని క్రీడల్లో అమల్లో ఉన్నా ఈ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్ పదం ‘రెపిచెర్’ నుంచి వచ్చిన రెపిచేజ్ అంటే ఏమిటి? రెపిచేజ్ అంటే సామాన్యార్థంలో ‘రక్షించడం’. ఏదేని పోటీ ప్రిలిమినరీ
రెపిచేజ్..ఇప్పటికే కొన్ని క్రీడల్లో అమల్లో ఉన్నా ఈ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్ పదం ‘రెపిచెర్’ నుంచి వచ్చిన రెపిచేజ్ అంటే ఏమిటి? రెపిచేజ్ అంటే సామాన్యార్థంలో ‘రక్షించడం’. ఏదేని పోటీ ప్రిలిమినరీ రౌండ్లలో పరాజయం చవిచూసిన ఆటగాడికి..పతక రౌండ్‌కు మరో అవకాశం కల్పించడం అన్నమాట. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెపిచేజ్‌కు అవకాశం కల్పించాలని వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) 2022లో నిర్ణయించింది. ఈ మేరకు ఈసారి పురుషులు, మహిళల విభాగాల్లో 200 మీ., 400 మీ., 1500 మీ., పరుగు, 400మీ. హర్డిల్స్, ,100మీ పరుగు, 100 మీ., హర్డిల్స్, రోయింగ్, రెజ్లింగ్, జూడో, తైక్వాండోలో రెపిచేజ్‌కు అవకాశం కల్పించారు. కొన్నిసార్లు ప్రిలిమినరీ రౌండ్లలో కొందరు అథ్లెట్లు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో రెపిచేజ్ వల్ల ‘సమమైన పోటీ’కి చాన్సు ఉంటుంది. రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కల్‌లో భారత్ తరపున బలరాజ్ పన్వర్ బరిలో నిలిచాడు. ప్రిలిమినరీ రౌండ్లలో నాలుగో స్థానంలో నిలిచిన అతడికి రెపిచేజ్ రౌండ్‌కు అవకాశం లభించింది.
ఒక్కో క్రీడాంశంలో భిన్నం..
రెపిచేజ్ రౌండ్ ఒక్కో క్రీడలో ఒక్కోలా ఉంటుంది. సాధార ణంగా అథ్లెటిక్స్‌లో ప్రిలిమినరీ, సెమీఫైనల్, ఫైనల్ రౌండ్లుం టాయి. టాప్-3లో నిలిచిన అథ్లెట్లు సహజంగానే ఫైనల్‌కు చేరతారు. అయితే టాప్-3లో నిలవని ఫాస్టెస్ట్ అథ్లెట్లకోసం కొన్ని స్థానాలు కేటాయిస్తారు. ప్రిలిమినరీ రౌండ్ల ద్వారా క్వాలిఫై కాలేకపోయిన అథ్లెట్‌కు రెపిచేజ్ ద్వారా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశం దక్కుతుంది. అందువల్ల పారిస్ అథ్లెటిక్స్‌లో గతానికి (ప్రిలిమినరీ, సెమీఫైనల్స్, ఫైనల్) భిన్నంగా ఈసారి నాలుగు (ప్రిలిమినరీ, రెపిచేజ్, సెమీస్, ఫైనల్) రౌండ్లుంటాయి. రెజ్లింగ్, జూడో, తైక్వాండోలోనూ రెపిచేజ్ నిబంధనలు కొంచెం భిన్నంగా ఉంటాయి.