రైజర్సా.. మజాకా!
ABN , Publish Date - May 09 , 2024 | 05:15 AM
పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఉప్పల్‌లో మరోసారి పరుగుల మోత మోగించింది. కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్)...
నేటి మ్యాచ్
పంజాబ్X బెంగళూరు, రాత్రి 7.30 గం. వేదిక: ధర్మశాల
లక్ష్యం166 (9.4 ఓవర్లలోనే ఛేదన)
హెడ్, అభిషేక్ విధ్వంసం
10 వికెట్లతో లఖ్‌నవూపై ఘన విజయం
హైదరాబాద్: పవర్ హిట్టింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఉప్పల్‌లో మరోసారి పరుగుల మోత మోగించింది. కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 నాటౌట్), అభిషేక్ శర్మ (28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) ఊచకోతతో.. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 58 బంతుల్లోనే ఛేదించిన సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింతగా మెరుగుపరచుకొంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎ్‌సజీ)ను మట్టికరిపించింది. తొలుత లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 165/4 స్కోరు చేసింది. ఆయుష్ బదోని (30 బంతుల్లో 9 ఫోర్లతో 55 నాటౌట్), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 48 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్ (29) రాణించారు. పొదుపుగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ (4-0-12-2) రెండు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. ఐపీఎల్‌లో లఖ్‌నవూపై ఆరెంజ్ ఆర్మీకి ఇదే తొలి గెలుపు కావడం విశేషం. మొత్తం 14 పాయింట్లతో సన్‌రైజర్స్ మూడో స్థానానికి దూసుకెళ్లింది. హెడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
వికెట్ పడకుండా..: ఛేదనలో హెడ్, అభిషేక్ పోటీపడి మరీ షాట్లు ఆడడంతో.. వార్ వన్‌సైడ్ అయింది. లఖ్‌నవూ బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడిన వీరు.. ఫోర్లు, సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో హైదరాబాద్ 62 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. రెండో ఓవర్‌లో యశ్ బౌలింగ్‌లో అభిషేక్ నాలుగు ఫోర్లతో విధ్వంసానికి తెరతీయగా.. ఆ తర్వాతి ఓవర్‌లో హెడ్ 6,4,6,6తో ఏకంగా 22 పరుగులు పిండుకొన్నాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో అభిషేక్ సిక్స్ బాదగా.. హెడ్ 4,6తో జోరు చూపాడు. ఇక, 5వ ఓవర్‌లో నవీనుల్ బౌలింగ్‌లో శివాలెత్తిన హెడ్ సిక్స్, 4 ఫోర్లతో 23 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. శర్మ కూడా మరో రెండు సిక్స్‌లు బాదడంతో.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 107/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. మధ్య ఓవర్లలో కూడా వీరిద్దరూ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడడంతో లఖ్‌నవూ బౌలర్లకు దిక్కుతోచలేదు. సిక్స్‌తో అభిషేక్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 9వ ఓవర్‌లోనే టీమ్ స్కోరు 150 దాటింది. అదే జోరులో శర్మ భారీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
ఆదుకొన్న బదోని-పూరన్: సన్‌రైజర్స్ బౌలర్ల దెబ్బకు టాపార్డర్ విఫలమైనా.. ఆయుష్ బదోని ధనాధన్ అర్ధ శతకంతో లఖ్‌నవూ మెరుగ్గానే ముగించింది. పూరన్‌తో కలసి డెత్ ఓవర్లలో చెలరేగిన బదోని.. ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 99 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించాడు. పవర్‌ప్లేలోనే ఓపెనర్ డికాక్ (2), స్టొయినిస్ (3)ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో.. లఖ్‌నవూ స్కోరు నత్తనడకన సాగింది. హైదరాబాద్ ఫీల్డర్లు కూడా బౌలర్లకు చక్కని సహకారం అందించారు. బౌండ్రీ రోప్ వద్ద నితీష్ అందుకొన్న అద్భుత క్యాచ్‌తో డికాక్ వెనుదిరగగా.. సన్వీర్ సింగ్ డైవింగ్ క్యాచ్‌తో స్టొయినిస్ పెవిలియన్ చేరాడు. దీంతో తొలి ఆరు ఓవర్లు ముగిసేసరికి లఖ్‌నవూ 27/2తో ఈ సీజన్‌లోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసింది. అయితే, కెప్టెన్ రాహుల్‌కు జత కలసిన క్రునాల్ పాండ్యా (24) రెండో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 8వ ఓవర్‌లో ఉనాద్కట్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాదిన క్రునాల్.. స్తబ్ధుగా ఉన్న స్కోరు బోర్డులో ఊపుతెచ్చాడు. మరోవైపు ఫోర్‌తో గేర్ మార్చేందుకు యత్నిస్తున్న రాహుల్‌ను కమిన్స్ పెవిలియన్ చేర్చి దెబ్బకొట్టాడు. ఎదురుదాడి చేస్తున్న క్రునాల్‌ను కమిన్స్ రనౌట్ చేయడంతో 11.2 ఓవర్లలో లఖ్‌నవూ 66/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో పూరన్, బదోని పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత తీసుకొన్నారు. నటరాజన్ వేసిన 14వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టిన బదోని 17 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్‌లో విజయ్‌కాంత్ బౌలింగ్‌లో పూరన్ సిక్స్‌తో బ్యాట్‌కు పని చెప్పడంతో టీమ్ స్కోరు సెంచరీ మార్క్ దాటింది. ఇక, డెత్ ఓవర్లలో వీరిద్దరూ జోరు పెంచారు. 19వ ఓవర్‌లో బదోని 2 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. చివరో ఓవర్‌లో పూరన్ మూడు బౌండ్రీలతో టీమ్ స్కోరును 160 మార్క్ దాటించాడు.
స్కోరుబోర్డు
లఖ్‌నవూ: రాహుల్ (సి) నటరాజన్ (బి) కమిన్స్ 29, డికాక్ (సి) నితీశ్ (బి) భువనేశ్వర్ 2, స్టొయినిస్ (సి) సన్వీర్ (బి) భువనేశ్వర్ 3, క్రునాల్ (రనౌట్) 24, పూరన్ (నాటౌట్) 48, బదోని (నాటౌట్) 55, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 165/4; వికెట్ల పతనం: 1-13, 2-21, 3-57, 4-66; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-12-2, కమిన్స్ 4-0-47-1, షాబాజ్ 2-0-9-0, విజయ్‌కాంత్ 4-0-27-0, ఉనాద్కట్ 2-0-19-0, నటరాజన్ 4-0-50-0.
సన్‌రైజర్స్: అభిషేక్ (నాటౌట్) 75, హెడ్ (నాటౌట్) 89, ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 9.4 ఓవర్లలో 167/0; బౌలింగ్: కృష్ణప్ప 2-0-29-0, యశ్ ఠాకూర్ 2.4-0-47-0, రవి బిష్ణోయ్ 2-0-34-0, నవీనుల్ 2-0-37-0, బదోని 1-0-19-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
కోల్‌కతా 11 8 3 0 16 1.453
రాజస్థాన్ 11 8 3 0 16 0.476
హైదరాబాద్ 12 7 5 0 14 0.406
చెన్నై 11 6 5 0 12 0.700
ఢిల్లీ 12 6 6 0 12 -0.316
లఖ్‌నవూ 12 6 6 0 12 -0.769
బెంగళూరు 11 4 7 0 8 -0.049
పంజాబ్ 11 4 7 0 8 -0.187
ముంబై 12 4 8 0 8 -0.212
గుజరాత్ 11 4 7 0 8 -1.320
1
ఐపీఎల్‌లో ఇదే అత్యంత వేగవంతమైన ఛేదన
మిగిలి ఉన్న బంతుల (62) పరంగా ఐపీఎల్‌లో ఇదే అత్యధిక విజయం. 2022లో పంజాబ్‌పై ఢిల్లీ 57 బంతులుండగానే గెలిచింది.
సన్‌రైజర్స్ చేసిన 167 పరుగులే ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు. ఈ సీజన్‌లోనే హైదరాబాద్ .. ఢిల్లీపై 158/4, ముంబైపై 148/2 స్కోర్లు చేసింది.
2
పవర్‌ప్లేలో అత్యధిక అర్ధ శతకాలు బాదిన రెండో బ్యాటర్‌గా హెడ్ (4).
6 హాఫ్ సెంచరీలతో వార్నర్ టాప్‌లో ఉన్నాడు.