Share News

Rohit Sharma: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఒకే రోజు మూడు రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ!

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:58 PM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం ప్రదర్శించాడు. సెయింట్ లూయిస్ మైదానంలో పట్టపగలే ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

Rohit Sharma: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఒకే రోజు మూడు రికార్డులను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ!
Rohit Sharma

టీ20 ప్రపంచకప్‌ (T20 Worldcup)లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విశ్వరూపం ప్రదర్శించాడు. సెయింట్ లూయిస్ మైదానంలో పట్టపగలే ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తం 41 బంతులు ఆడి 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో పలు రికార్డులను (Rohit Records) తన ఖాతాలో వేసుకున్నాడు (India vs Australia).


ఈ మ్యాచ్‌లో మొత్తం 8 సిక్స్‌లు కొట్టిన రోహిత్ అంతర్జాతీయ టీ-20ల్లో 200 సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్ మొత్తం 203 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్తిల్ (173), జాస్ బట్లర్ (137), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (133), నికోలస్ పూరన్ (132), సూర్యకుమార్ యాదవ్ (131) ఉన్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థిపై అన్ని ఫార్మాట్లలోనూ కలిసి అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో కూడా రోహిత్ మొదటి స్థానానికి ఎగబాకాడు. టెస్ట్‌లు, వన్డేలు, టీ-20ల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ మొత్తం 132 సిక్స్‌లు కొట్టాడు. అంతకు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. ఇంగ్లండ్‌పై గేల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 130 సిక్స్‌లు కొట్టాడు.


ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా కూడా రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ 7 సిక్స్‌లు కొట్టాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ మొత్తం 8 సిక్స్‌లు కొట్టాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌-2024లో అతి తక్కువ బంతుల్లో 50 పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. 19 బంతుల్లోనే రోహిత్ అర్ధశతకం నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి..

AFG vs BAN: ఇది ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్.. మ్యాచ్ మధ్యలో ఏం చేశాడంటే?


T20 World Cup: సెమీఫైనల్స్‌లో వర్షం పడితే ఏమవుతుంది.. ఐసీసీ నిబంధనలేంటి?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 25 , 2024 | 03:58 PM