Share News

రూట్‌, బ్రూక్‌ శతక మోత

ABN , Publish Date - Oct 10 , 2024 | 05:08 AM

జో రూట్‌ (176 బ్యాటింగ్‌), హ్యారీ బ్రూక్‌ (141 బ్యాటింగ్‌) శతకాల మోత మోగించడంతో పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ దీటుగా బదులిస్తోంది. ఆటకు మూడో రోజు క్రితం...

రూట్‌, బ్రూక్‌ శతక మోత

ఇంగ్లండ్‌ 492/3

ముల్తాన్‌: జో రూట్‌ (176 బ్యాటింగ్‌), హ్యారీ బ్రూక్‌ (141 బ్యాటింగ్‌) శతకాల మోత మోగించడంతో పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ దీటుగా బదులిస్తోంది. ఆటకు మూడో రోజు క్రితం రోజు స్కోరు 96/1తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ 3 వికెట్లకు 492 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 556 పరుగులకు ఇంగ్లండ్‌ ఇంకా 64 రన్స్‌ దూరంలో ఉంది.

గవాస్కర్‌ రికార్డు బద్దలు..: టెస్టుల్లో అత్యధికంగా 35 శతకాలు బాదిన ఐదో బ్యాటర్‌గా రూట్‌ రికార్డుల కెక్కాడు. ఈ క్రమంలో 34 సెంచరీలు చేసిన గవాస్కర్‌, లారా, జయవర్దనె, యూనిస్‌ ఖాన్‌లను దాటేశాడు. కాగా, ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన కుక్‌ (12,472)ను రూట్‌ (12,578) అధిగమించాడు.

Updated Date - Oct 10 , 2024 | 05:08 AM