Share News

ఏడాది తర్వాత మళ్లీ వన్డేల్లోకి రూట్‌

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:57 AM

వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌ బరిలోకి దిగనున్నాడు. ఏడాది తర్వాత తను వన్డేల్లో ఆడబోతుండడం విశేషం. ఈ మెగా టోర్నీతో పాటు...

ఏడాది తర్వాత మళ్లీ  వన్డేల్లోకి  రూట్‌

లండన్‌: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌ బరిలోకి దిగనున్నాడు. ఏడాది తర్వాత తను వన్డేల్లో ఆడబోతుండడం విశేషం. ఈ మెగా టోర్నీతో పాటు భారత పర్యటనలో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సల కోసం ఇంగ్లండ్‌ జట్లను ఆదివారం ప్రకటించారు. 2023 వన్డే వరల్డ్‌క్‌పలో రూట్‌ విఫలం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక గాయం నుంచి కోలుకుంటున్న బెన్‌ స్టోక్స్‌కు బెర్త్‌ దక్కలేదు. భారత పర్యటనలో జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుండగా.. రెండు ఫార్మాట్లకు జోస్‌ బట్లర్‌ నేతృత్వం వహించనున్నాడు. టీ20 జట్టులో రూట్‌ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ ఆడనున్నాడు.

Updated Date - Dec 23 , 2024 | 04:57 AM