Share News

SRH vs RCB: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:26 PM

ఐపీఎల్-2024లో భాగంగా.. సోమవారం (15/04/24) ఎం. చినస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.

SRH vs RCB: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్

ఐపీఎల్-2024లో (IPL 2024) భాగంగా.. సోమవారం (15/04/24) ఎం. చినస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers Bengaluru) బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు టాస్ వేయగా.. ఆర్సీబీ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. ఆర్సీబీ మాత్రం కేవలం ఒక్క విజయంతో చివరిదైన పదో స్థానంలో ఉంది.

చరిత్ర సృష్టించిన ధోనీ.. ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్

ఈ సీజన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడి, ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది కాబట్టి.. ఇకపై ఆర్సీబీ ఆడే మ్యాచ్‌లన్నీ అత్యంత కీలకమైనవి. అందుకే.. ఈ మ్యాచ్‌లో నెగ్గాలని ఆర్సీబీ భావిస్తోంది. ఎలాగైనా విజయం సాధించాలన్న పంతంతో బరిలోకి దిగింది. పైగా.. హోమ్‌గ్రౌండ్‌లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి, గత పరాభావాలకు సమాధానం చెప్పాలని చూస్తోంది. అటు.. ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన సన్‌రైజర్స్ కూడా మంచి జోష్ మీద ఉంది. ప్రత్యర్థి జట్టుని వారి హోమ్‌గ్రౌండ్‌లో ఓడించి.. తమ సత్తా చాటుకోవాలని భావిస్తోంది. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.


తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్‌రమ్, నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనాద్కట్, టీ. నటరాజన్

ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పాటిదార్, సౌరవ్ చౌహాన్, దినేశ్ కార్తిక్, మహిపాల్ లామ్రోర్, లాకీ ఫెర్గ్యూసన్, రీస్ టాప్లే, వైశాక్ విజయ్ కుమార్, యశ్ దయాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 07:26 PM