Sachin Deepfake Video: ఆ వీడియో నాది కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై సచిన్ క్లారిటీ!
ABN , Publish Date - Jan 15 , 2024 | 02:27 PM
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు నెట్టింట కలకలం రేపుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందిస్తున్న ఈ మార్ఫింగ్ వీడియోలు చాలా మందికి తలనొప్పి తెస్తున్నాయి. కొద్ది రోజుల కిందట హీరోయిన్లు రష్మిక, కాజోల్ వంటి హీరోయిన్లు ఇలాంటి వీడియోలపై ఫిర్యాదులు చేశారు.
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు (Deepfake Video) నెట్టింట కలకలం రేపుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందిస్తున్న ఈ మార్ఫింగ్ వీడియోలు చాలా మందికి తలనొప్పి తెస్తున్నాయి. కొద్ది రోజుల కిందట రష్మిక, కాజోల్ వంటి హీరోయిన్లు ఇలాంటి వీడియోలపై ఫిర్యాదులు చేశారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా డీప్ ఫేక్ బారిన పడ్డాడు. వెంటనే సచిన్ తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించాడు (Sachin Deepfake Video).
వైరల్ అవుతున్న ఆ డీప్ ఫేక్ వీడియోలో సచిన్ ``స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్`` అనే గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నట్టు ఉంది. ఆ వీడియోపై సచిన్ వెంటనే స్పందించాడు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశాడు. ఇలా ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ``ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజినీ ఇలా దుర్వినియోగం చేయడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, యాప్‌లు ఎక్కడ కనిపించినా వెంటనే అందరూ రిపోర్ట్ చేయాలి. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల``ని సచిన్ ట్వీట్ చేశాడు.
సచిన్ కూతురు సారా (Sara Tendulkar) కూడా కొద్ది రోజుల క్రితం డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో (Shubman Gill) సారా ఉన్నట్టు ఆ వీడియోలో ఉంది. నిజానికి సారా తన సోదరుడు అర్జున్‌తో ఉన్నప్పుడు తీసిన వీడియోను మార్ఫింగ్ చేశారు. అర్జున్ మొహం స్థానంలో గిల్ మొహాన్ని అమర్చారు. ఈ వీడియోపై సారా ఫిర్యాదు చేసింది. వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.