క్రికెట్‌కు సాహా వీడ్కోలు
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:51 AM
వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్ అతడి కెరీర్‌లో చివరిది కానుంది. ‘క్రికెట్‌లో నా అద్భుత ప్రయాణానికి ముగింపు...
ఈ రంజీ సీజన్ కెరీర్‌లో చివరిదని ప్రకటన
న్యూఢిల్లీ: వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్ అతడి కెరీర్‌లో చివరిది కానుంది. ‘క్రికెట్‌లో నా అద్భుత ప్రయాణానికి ముగింపు పలుకబోతున్నాను. చివరిసారి రంజీల్లో బెంగాల్‌కు ఆడనున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ను మరపురానిదిగా మలిచేందుకు ప్రయత్నిద్దాం’ అని 40 ఏళ్ల సాహా సోషల్ మీడియాలో ప్రకటించాడు. 2010లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన తను 40 టెస్టుల్లో 1353 పరుగులు, 9 వన్డేల్లో 41 పరుగులు సాధించాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత సాహా జట్టు కీపర్‌గా సేవలందించినా.. పంత్ రాకతో స్థానం గల్లంతైంది. 2021లో చివరి టెస్టు ఆడాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి అన్ని సీజన్లు ఆడిన సాహా ఈసారి వేలంలో తన పేరును నమోదు కూడా చేసుకోలేదు.