Sakshi Dhoni: మేం ఓడిపోయినట్టు అనిపించడం లేదు.. ధోనీ బ్యాటింగ్‌కు సాక్షి ఫిదా..!
ABN , Publish Date - Apr 01 , 2024 | 10:42 AM
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వస్తే చాలు అతడి అభిమానులు ఉర్రూతలూగిపోతారు. అలాంటిది బ్యాట్‌తో సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వస్తే చాలు అతడి అభిమానులు ఉర్రూతలూగిపోతారు. అలాంటిది బ్యాట్‌తో సిక్స్‌లు, ఫోర్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది. స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆదివారం విశాఖపట్నంలో మ్యాచ్ చూసిన వారికి ఆ అనుభవం కళ్ల ముందు నిలిచి ఉంటుంది. చాలా రోజుల తర్వాత ధోనీ బ్యాట్‌తో చెలరేగుతుంటే స్టేడియంలోని అభిమానులు ``మహి.. మహి..`` అంటూ కేకలు వేశారు.
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట్సల్ మధ్య వైజాగ్ వేదికగా మ్యాచ్ జరిగింది (CSK vs DC). ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన చెన్నై బ్యాటింగ్‌లో తడబడింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ పాత ధోనీని గుర్తుకు తెచ్చాడు. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో విరుచుకుపడ్డాడు. ధోనీ చెలరేగినా ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ ఓడిపోయింది. అయితే ధోనీ బ్యాటింగ్ చూసిన చెన్నై అభిమానులు తమ టీమ్ ఓటమిని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు.
ధోనీ భార్య సాక్షి (Sakshi Dhoni) కూడా భర్త బ్యాటింగ్ చూసి మురిసిపోయింది. చెన్నై ఓడిపోయినట్టే తనకు అనిపించడం లేదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొంది. అలాగే చాలా రోజుల తర్వాత మైదానంలో అడుగు పెట్టి బ్యాట్‌తో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను (Rishabh Pant) కూడా సాక్షి అభినందించింది. ``వెల్కమ్ బ్యాక్ పంత్`` అంటూ పోస్ట్ చేసింది.