Share News

India vs England 5th Test: ముగిసిన రెండవ రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?

ABN , Publish Date - Mar 08 , 2024 | 05:10 PM

భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరిదైనా ధర్మశాల టెస్టులో (Dharmasala Test) రెండవ రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 8 వికెట్ల 473 పరుగులు చేసింది. దీంతో 255 పరుగుల ఆధిక్యంతో టీమిండియా పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. రెండవ రోజు ఆటలో హైలెట్స్ విషయానికి వస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుభ్‌మాన్ గిల్ (110) శతకాలతో చెలరేగారు. టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లడంతో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. యువ బ్యాటర్లు దేవధూత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా అదరగొట్టారు. మొదటి మ్యాచ్ ఆడుతున్న పడిక్కల్ వ్యక్తిగత స్కోరు 65 పరుగుల వద్ద ఔటయ్యాడు.

India vs England 5th Test: ముగిసిన రెండవ రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?

ధర్మశాల: భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరిదైనా ధర్మశాల టెస్టులో (Dharmasala Test) రెండవ రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 8 వికెట్ల 473 పరుగులు చేసింది. దీంతో 255 పరుగుల ఆధిక్యంతో టీమిండియా పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. రెండవ రోజు ఆటలో హైలెట్స్ విషయానికి వస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుభ్‌మాన్ గిల్ (110) శతకాలతో చెలరేగారు. టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లడంతో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. యువ బ్యాటర్లు దేవధూత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ కూడా అదరగొట్టారు. మొదటి మ్యాచ్ ఆడుతున్న పడిక్కల్ వ్యక్తిగత స్కోరు 65 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సర్ఫరాజ్ ఖాన్ 56 పరుగుల చేశాక షోయబ్ బషీర్ బౌలింగ్‌లో రూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్ (27), జస్ప్రీత్ బుమ్రా (19) క్రీజులో ఉన్నారు.

ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అత్యధికంగా 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత టామ్ హర్ట్లీ -2 , బెన్‌స్టోక్స్, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్: యశస్వి జైస్వాల్ (57), రోహిత్ శర్మ(103), శుభ్‌మాన్ గిల్(110), దేవ్‌దూత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56), రవీంద్ర జడేజా (15), ధ్రువ్ జురెల్ (15), రవిచంద్రన్ అశ్విన్ (0), కుల్దీప్ యాదవ్ (27 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా (19) చొప్పున పరుగులు చేశారు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 5, రవిచంద్రన్ అశ్విన్ 4, రవీంద్ర జడేజా 1 చొప్పున వికెట్లు తీశారు.

Updated Date - Mar 08 , 2024 | 05:12 PM