Vaibhav Suryavanshi : ‘వైభవం’గా ఫైనల్‌కు
ABN , Publish Date - Dec 07 , 2024 | 06:11 AM
ఐపీఎల్‌కు ఎంపికైన పిన్న వయసు క్రికెటర్‌గా రికార్డుకెక్కిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లీగ్‌కు ముందే మేజర్ టోర్నమెంట్‌లో సత్తా చాటుతున్నాడు. అండర్-19 ఆసియా
సెమీ్‌సలో లంకపై భారత్ గెలుపు
రేపు బంగ్లాతో తుదిపోరు
అండర్-19 ఆసియా కప్
షార్జా: ఐపీఎల్‌కు ఎంపికైన పిన్న వయసు క్రికెటర్‌గా రికార్డుకెక్కిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లీగ్‌కు ముందే మేజర్ టోర్నమెంట్‌లో సత్తా చాటుతున్నాడు. అండర్-19 ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబరచి జట్టును ఫైనల్ చేర్చాడు. వైభవ్ (36 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 67) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్ సెమీఫైనల్లో శ్రీలంకను ఏడు వికెట్లతో చిత్తుచేసింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మాలె (2/32), ఆయుష్ మాత్రే (2/37) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. ఇక.. ఛేదనలో వైభవ్ దూకుడుగా ఆడడంతో భారత్ 21.4 ఓవర్లలోనే 175/3 స్కోరు చేసి గెలిచింది. 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (28)తో కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. వైభవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీఫైనల్లో బంగ్లా ఏడు వికెట్లతో పాకిస్థాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకే పరిమితమైంది. బంగ్లా బౌలర్ ఇక్బాల్ (4/24) పాక్ బ్యాటర్ల భరతం పట్టాడు. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా 22.1 ఓవర్లలో 120/3 స్కోరుతో ఛేదించింది. బంగ్లా సారథి అజీజుల్ (61 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.