Shah Rukh Khan: గౌతమ్ గంభీర్‌కు బ్లాంక్ చెక్ ఆఫర్ చేసిన షారూక్ ఖాన్.. కేకేఆర్‌తోనే ఉంచేందుకు స్కెచ్!
ABN , Publish Date - May 27 , 2024 | 12:03 PM
ఐపీఎల్-2024 సీజన్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ నిలిచింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన కేకేఆర్ సునాయాసంగా టైటిల్ చేజిక్కించుకుంది. కేకేఆర్ టీమ్ టైటిల్ సాధించడం వెనుక ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. జట్టుతో పూర్తిగా మమేకమై సమర్థవంతంగా పని చేశాడు.
ఐపీఎల్-2024 (IPL 2024) సీజన్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ నిలిచింది. సీజన్ ఆసాంతం అద్భుతంగా రాణించిన కేకేఆర్ సునాయాసంగా టైటిల్ చేజిక్కించుకుంది. కేకేఆర్ టైటిల్ సాధించడం వెనుక ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక పాత్ర పోషించాడు. జట్టుతో పూర్తిగా మమేకమై సమర్థవంతంగా పని చేశాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌పై బీసీసీఐ (BCCI) దృష్టి సారించినట్టు సమాచారం. రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ (Teamindia Head Coach) పదవి కోసం బీసీసీఐ అన్వేషణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ పదవి కోసం జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి విదేశీ దిగ్గజ క్రికెటర్లు ప్రయత్నించారు. అయితే బీసీసీఐ మాత్రం గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గంభీర్‌కు కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టాలనే ఆశ ఉంది. అయితే గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్ మెంటార్‌గా ఉన్నాడు. ఒకవేళ టీమిండియా హెడ్ కోచ్ అయితే ఇక, ఐపీఎల్‌కు గంభీర్ పూర్తిగా దూరం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని షారూక్ ఖాన్ (Shah Rukh Khan), గంభీర్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గంభీర్, షారూక్ మధ్య పదేళ్ల డీల్ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్‌లో గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావాలంటూ గౌతమ్ గంభీర్‌ను షారుఖ్ ఖాన్ కోరారని, ఇందుకుగానూ బ్లాంక్ చెక్‌ను (Blank Cheque) ఆఫర్ చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పదేళ్లపాటు కోల్‌కతా జట్టుకి పనిచేయాలని గంభీర్‌ను షారూక్ అడిగినట్టు సమాచారం. దాంతోనే గంభీర్ ఈ సీజన్‌లో కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ కావాలంటే షారూక్ అంగీకారం ఉండాల్సిందేనని వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Gautam Gambhir: టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. ఫోటో చెప్పిన సాక్ష్యం?
Shreyas Iyer: సన్‌రైజర్స్‌పై శ్రేయస్ సెటైర్.. ఇలా అనేశాడేంటి?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..