Share News

Shreyas Iyer: వరల్డ్ కప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు నో ప్లేస్.. అతడి రియాక్షన్ చూసి షాకైన కేకేఆర్ కోచ్!

ABN , Publish Date - May 03 , 2024 | 02:50 PM

గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌ను అమోఘంగా నడిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు (శుక్రవారం) ముంబై ఇండియన్స్ టీమ్‌తో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ తలపడనుంది.

Shreyas Iyer: వరల్డ్ కప్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు నో ప్లేస్.. అతడి రియాక్షన్ చూసి షాకైన కేకేఆర్ కోచ్!
shreyas iyer

గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2024)కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌ను అమోఘంగా నడిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు (శుక్రవారం) ముంబై ఇండియన్స్ టీమ్‌తో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ తలపడనుంది (KKR vs MI). ఈ నేపథ్యంలో కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar).. శ్రేయాస్ అయ్యర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. శ్రేయాస్ అయ్యర్ చాలా బలమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తి అని పేర్కొన్నాడు (T20 World Cup).


రంజీ మ్యాచ్ ఆడని కారణంగా శ్రేయాస్ అయ్యర్ పేరును సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌ నుంచి బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ-20 ప్రపంచకప్ ఆడే జట్టులో కూడా శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. అంత కీలక టోర్నీకి దూరం కావడం, సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడం వంటి వాటి వల్ల కూడా శ్రేయాస్ అయ్యర్ మానసికంగా డిస్ట్రబ్ కాలేదని అభిషేక్ నాయర్ తెలిపాడు. శ్రేయాస్ అయ్యర్ మానసికంగా దృఢంగా ఉండడం వల్లే ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ అద్భుతంగా రాణిస్తోందని తెలిపాడు.


``నాకు తెలిసిన వ్యక్తుల్లో శ్రేయాస్ అయ్యర్ మానసికంగ దృఢమైన వ్యక్తి. తనకు జరిగిన విషయాలను అతడు చాలా సునాయాసంగా ఆమోదించాడు. ఆ ఘటనల గురించి అతడు మాట్లాడడం కూడా నేను వినలేదు. నీ ముందున్న దానిని నువ్వు అంగీకరించాల్సిందే అనేది శ్రేయాస్ ఫిలాసఫీ. చేతుల్లో లేని విషయాల గురించి అతడు పట్టించుకోడు. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్ మీదే దృష్టిపెట్టాడ``ని అభిషేక్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్


T20 World Cup: మీడియా సమావేశం నుంచి నేరుగా రింకూ సింగ్ దగ్గరికి వెళ్లిన కెప్టెన్ రోహిత్ శర్మ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 03 , 2024 | 02:53 PM