Sri Lanka VS New Zealand: న్యూజిలాండ్‌కు ఘోర పరాభవం.. శ్రీలంక భారీ విజయం..
ABN , Publish Date - Sep 29 , 2024 | 03:19 PM
రెండు టెస్ట్‌ల సిరీస్‌ను శ్రీలంక సునాయాసంగా కైవసం చేసుకుంది. మొదటి టెస్ట్‌లో గెలుపొందిన శ్రీలంక తాజాగా గాలేలో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌కు చేదు అనుభవాన్ని రుచి చూపించింది. ఇన్నింగ్స్, 154 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి చవి చూసింది.
అనుకున్నట్టే జరిగింది. శ్రీలంక (Sri Lanka) చేతిలో న్యూజిలాండ్ (New Zealand) ఘోర పరాజయాన్ని చవి చూసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు కాస్త మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ భారీ ఓటమిని న్యూజిలాండ్ తప్పించుకోలేకపోయింది. ఇన్నింగ్స్, 154 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి చవి చూసింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను శ్రీలంక సునాయాసంగా కైవసం చేసుకుంది. మొదటి టెస్ట్‌లో గెలుపొందిన శ్రీలంక తాజాగా గాలేలో జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌కు చేదు అనుభవాన్ని రుచి చూపించింది (Sri Lanka VS New Zealand).
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 602/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ కేవలం 88 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లంకకు 514 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (78), మిచెల్ శాంట్నర్ (67), టామ్ బ్లండెల్ (60), డ్వేన్ కాన్వే (61) అర్ధశతకాలు సాధించారు. వీరి పోరాటంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 360 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు.
మొత్తానికి శ్రీలంకతో సిరీస్‌లో వైట్ వాష్ అయిన న్యూజిలాండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో కిందకు దిగజారింది. పాయింట్ల పట్టికలో ఏకంగా ఏడో స్థానానికి దిగజారిపోయింది. ఇక, అద్భుత విజయాలు సాధించిన లంక ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. 55.56 శాతం విజయాలతో శ్రీలకం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ పట్టికలో భారత్ (71.67 శాతం విజయాలు), ఆస్ట్రేలియా (62.50 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా వచ్చే నెలలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది.
ఇవి కూడా చదవండి..
India vs Bangladesh: భారత్, బంగ్లా టెస్టులో మూడో రోజు గేమ్ అప్‌డేట్..మొదలవుతుందా
వంద కోట్లకు పైగా అతడిని ఫాలో అవుతున్నారు!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..