Gsoup B T20 World Cup : స్టొయినిస్ ఆల్‌రౌండ్‌షో
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:59 AM
మార్కస్ స్టొయినిస్ (36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్; 3/19) ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించడంతో టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ చేసింది. గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో కంగారూలు ఘనవిజయం సాధించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్
ఒమన్‌పై ఆసీస్ విక్టరీ
టీ20 వరల్డ్‌కప్
బ్రిడ్జిటౌన్: మార్కస్ స్టొయినిస్ (36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 నాటౌట్; 3/19) ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించడంతో టీ20 ప్రపంచక్‌పలో ఆస్ట్రేలియా ఘనంగా బోణీ చేసింది. గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో కంగారూలు ఘనవిజయం సాధించారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56) అర్ధసెంచరీ సాధించాడు. అయితే ఒమన్ బౌలర్ల ధాటికి ఆరంభంలో హెడ్ (12), మార్ష్ (14), మ్యాక్స్‌వెల్ (0) నిరాశపర్చగా, ఆసీస్ 50/3 స్కోరుతో ఇబ్బంది పడింది. ఈ దశలో స్టొయినిస్ స్వేచ్ఛగా ఆడేస్తూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 15వ ఓవర్లోనైతే నాలుగు సిక్సర్లతో 26 రన్స్ రాబట్టాడు. అలాగే వార్నర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడం విశేషం. ఆ తర్వాత ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులే చేయగలిగింది. అయాన్ ఖాన్ (36) టాప్ స్కోరర్. స్టార్క్, జంపా, ఎల్లి్సలకు రెండేసి వికెట్లు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ర్టేలియా : 20 ఓవర్లలో 164/5 (స్టొయినిస్ 67 నాటౌట్, వార్నర్ 56; మెహ్రాన్ 2/38); ఒమన్: 20 ఓవర్లలో 125/9 (అయాన్ 36, మెహ్రాన్ 27; స్టొయినిస్ 3/19, స్టార్క్ 2/20, జంపా 2/24, ఎల్లిస్ 2/28).
టీ20 క్రికెట్లో ఎక్కువ (111) 50+ స్కోర్లను సాధించిన వార్నర్. గేల్ (110)ను దాటేశాడు.