Olympic Rugby : ‘సూపర్ ఉమన్’
ABN , Publish Date - Aug 01 , 2024 | 01:01 AM
పారిస్ ఒలింపిక్స్ మహిళల రగ్బీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ స్టార్ ఎరిన్ కింగ్ ‘సూపర్ హ్యూమన్’ తరహాలో తన శక్తియుక్తులను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
పారిస్ ఒలింపిక్స్ మహిళల రగ్బీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ స్టార్ ఎరిన్ కింగ్ ‘సూపర్ హ్యూమన్’ తరహాలో తన శక్తియుక్తులను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. ప్రత్యర్థి బ్రిటన్ జట్టు క్రీడాకారిణులు బంతిని ఐర్లాండ్ జట్టు సభ్యురాలైన ఎమిలీ లేన్ లక్ష్యంగా విసిరేశారు. దీన్ని పసిగట్టిన ఎరిన్.. లిప్తపాటులో ఎమిలీని అమాంతం పైకి ఎత్తేయడం.. ఆమె బంతిని అందుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అంతేకాదు, ఎంతబలంగా పైకి ఎత్తుకుందో అంతే చాకచక్యంగా ఎమిలీని గాయాలపాలవకుండా కిందకు దించిన ఎరిన్ ‘సూపర్ ఉమన్’ను అనిపించుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో బ్రిటన్ 28 -12తో ఐర్లాండ్‌పై గెలిచింది.